Telugu Global
CRIME

మళ్లీ నిర్భయ కేసు దోషి పిటిషన్ కొట్టేసిన సుప్రీం.. ఫిబ్రవరి 1న ఉరి

దేశాన్నే కదిలించిన నిర్భయ కేసులో.. తన వైఖరిని సుప్రీం కోర్టు ఏ మాత్రం మార్చుకో లేదు. ఉరి శిక్ష ఖరారైన దోషి పదే పదే తమకు క్షమాభిక్ష కల్పించాలని పిటిషన్లు వేస్తున్న ముఖేష్ విషయంలో స్థిరమైన నిర్ణయాన్ని వ్యక్త పరుస్తోంది. తను పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ ను రాష్ట్రపతి తిరస్కరించడంపై.. ముఖేష్ సుప్రీం కోర్టులో సవాల్ చేశాడు. ఈ పిటిషన్ ను జస్టిస్ భానుమతి నేతృత్వంలోని ధర్మాసనం కొట్టివేసింది. రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. […]

మళ్లీ నిర్భయ కేసు దోషి పిటిషన్ కొట్టేసిన సుప్రీం.. ఫిబ్రవరి 1న ఉరి
X

దేశాన్నే కదిలించిన నిర్భయ కేసులో.. తన వైఖరిని సుప్రీం కోర్టు ఏ మాత్రం మార్చుకో లేదు. ఉరి శిక్ష ఖరారైన దోషి పదే పదే తమకు క్షమాభిక్ష కల్పించాలని పిటిషన్లు వేస్తున్న ముఖేష్ విషయంలో స్థిరమైన నిర్ణయాన్ని వ్యక్త పరుస్తోంది.

తను పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ ను రాష్ట్రపతి తిరస్కరించడంపై.. ముఖేష్ సుప్రీం కోర్టులో సవాల్ చేశాడు. ఈ పిటిషన్ ను జస్టిస్ భానుమతి నేతృత్వంలోని ధర్మాసనం కొట్టివేసింది.

రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఖైదీని వేధించారని చెప్పిన కారణాన్ని కూడా.. రాష్ట్రపతి ఉత్తర్వుల నేపథ్యంలో పరిగణించలేమని చెప్పింది. ఫలితంగా.. ఉరినుంచి తప్పించుకునేందుకు ముఖేష్ చేసిన ప్రయత్నం మరోసారి విఫలమైంది.

ఈ నేపథ్యంలో.. ఫిబ్రవరి 1న తీహార్ జైలులో నిర్భయ కేసు దోషులకు ఉరి వేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఇసుక బస్తాలతో ట్రయల్స్ కూడా నిర్వహించారు. తాజాగా.. ముఖేష్ పిటిషన్ పై సుప్రీం కోర్టు స్పందించిన మేరకు.. ఫిబ్రవరి 1నే ఉరి తీతకు రంగం సిద్ధం చేస్తున్నారు.

First Published:  29 Jan 2020 12:00 AM GMT
Next Story