Telugu Global
National

హ‌స్తిన‌లో ప‌వ‌న్ పరిస్థితి ఇది !

ఒకప్పుడు పవన్ కనిపిస్తే చాలు…బొకేలు, పూలదండలతో చాలామంది క్యూ కట్టేవారు. కానీ ఇప్పుడు సీన్ మారింది…ఏపీలో ఆయనకంత సీన్ లేదని మొన్నటి ఎన్నికల ఫలితాలతో తెలిసిపోయింది. అందుకే ఇప్పుడు డ్యామేజ్ అయిన ఇమేజ్ ను కాపాడుకునేందుకు తెగ కష్టపడుతున్నాడు పవన్ కళ్యాణ్. ప్రస్తుతానికి హస్తినలో కమలంలో ఖాళీగా ఉన్న నేతలను మాత్రమే పవన్ కలిశాడు. బీజేపీ అసలు పెద్దలను కలవడానికి తీవ్రంగా ప్రయత్నించాడు… అయితే ఆయనకు కనీసం అపాయింట్ మెంట్ కూడా దొరకలేదు. పవన్ సన్నిహితులు ఏపీ వెళ్లిపొమ్మని […]

హ‌స్తిన‌లో ప‌వ‌న్ పరిస్థితి ఇది !
X

ఒకప్పుడు పవన్ కనిపిస్తే చాలు…బొకేలు, పూలదండలతో చాలామంది క్యూ కట్టేవారు. కానీ ఇప్పుడు సీన్ మారింది…ఏపీలో ఆయనకంత సీన్ లేదని మొన్నటి ఎన్నికల ఫలితాలతో తెలిసిపోయింది. అందుకే ఇప్పుడు డ్యామేజ్ అయిన ఇమేజ్ ను కాపాడుకునేందుకు తెగ కష్టపడుతున్నాడు పవన్ కళ్యాణ్.

ప్రస్తుతానికి హస్తినలో కమలంలో ఖాళీగా ఉన్న నేతలను మాత్రమే పవన్ కలిశాడు. బీజేపీ అసలు పెద్దలను కలవడానికి తీవ్రంగా ప్రయత్నించాడు… అయితే ఆయనకు కనీసం అపాయింట్ మెంట్ కూడా దొరకలేదు. పవన్ సన్నిహితులు ఏపీ వెళ్లిపొమ్మని సలహా ఇచ్చినా… పెద్దాయనతో ఫొటో లేకుంటే నా పరువు ఉంటుందా? అంటూ పవన్ అక్కడే ఉన్నాడట.

కమలం-గ్లాసు దోస్తీని ప్రపంచానికి… చాటి చెప్పేందుకు హస్తినకు వెళ్లాడు పవన్. వెళ్లిన రెండ్రోజులు కమలం నేతలతో బాగానే ఫొటోలు దిగాడు.. బొకేలిచ్చి భోజనాలు చేశాడు. కానీ మూడోరోజు అందరూ మూడాఫ్‌ అయ్యారు. జనసేన అధినేత మాత్రం అమిత్‌షా-మోదీ అపాయింట్‌ మెంట్ కోసం తెగ ట్రై చేశాడు. ఇంత దూరం వచ్చి మోదీ-అమిత్ షాతో ఫొటో లేకుంటే.. పరువు గోవిందా అని భావించాడట పవన్.

అందుకు బీజేపీ నేతలందర్నీ కలిసి అపాయింట్‌మెంట్ కోసం ట్రై చేశాడట. కానీ ఏమాత్రం కుదరలేదు..హడావిడిగా మంగళగిరిలో పరామ లు ఆపేసుకుని పవన్ ఢిల్లీ వెళ్తే.. అక్కడేదో జరగబోతోంది అని అనుకున్నారంతా. వైసీపీని గద్దె దించే వరకు నిద్రపోను అంటే.. ఢిల్లీ నుంచి ఏదో పెద్ద బ్రేకింగ్ న్యూసే ఉంటుందని అనుకున్నారు. కానీ అలాంటిదేమీ లేదు సరికదా.. పవన్ కు కనీసం అపాయింట్ మెంట్ కూడా దొరక లేదు.

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ని కలవడం, ఆ తర్వాత కొత్త అధ్యక్షుడు జేపీ నడ్డాని కలిసి బొకేలివ్వడంతో ఢిల్లీ టూర్ ని ఓ విహార యాత్ర లా చేసిన పవన్…ఢిల్లీ నుంచి తిరిగొచ్చేలోగా ప్రధాని మోడీని కచ్చితంగా కలిసి ఒక ఫొటో దిగాలని అనుకున్నాడట.

గతంలో టీడీపీ, బీజేపీకి గుడ్ బై చెప్పిన తర్వాత పవన్ ఎప్పుడూ ప్రధానిని ఇంతవరకు కలవలేదు. తాజా పొత్తు నేపథ్యంలో కూడా పక్క రాష్ట్రాల ఎంపీలతో చర్చలు జరిపారు కానీ, ప్రధాని అపాయింట్ మెంట్ మాత్రం కుదరలేదు.

అయితే ఆ మధ్య మోహన్ బాబు కుటుంబ సమేతంగా ప్రధాని మోడీని కలవడంతో.. మోహన్ బాబుకి మోడీ ఇచ్చిన ప్రాధాన్యత, పవన్ కి ఇవ్వలేదేంటని చాలామంది చెవులు కొరుక్కున్నారు.

పవన్ కి ఈ విషయం చేరిందో లేదో తెలియదు కానీ.. మోడీని కలవకుండా ఏపీకి వెళ్తే తనకే పరువు తక్కువ అని అనుకున్నాడట.

కానీ మోడీ అపాయింట్ మెంట్ ఇప్పించండని అందర్నీ అడిగి అడిగి చివరకు… అపాయింట్ మెంట్ దొరక్క పోవడంతో ఏపీకి తిరిగి వచ్చేశాడట పవన్ కళ్యాణ్.

First Published:  29 Jan 2020 12:06 AM GMT
Next Story