ఫ్యాన్స్ కు షాకిచ్చిన రాజమౌళి…. 2021కి ఆర్ఆర్ఆర్ వాయిదా

దాదాపు 400 కోట్ల సినిమా ఆర్ఆర్ఆర్. దర్శకుడు రాజమౌళి ‘బాహుబలి’ తర్వాత తీస్తున్న మూవీ. దీనిపై ఎన్నో అంచనాలున్నాయి. అలాంటి సినిమాను సీజన్ లేనప్పుడు విడుదల చేస్తే నిర్మాతకు నష్టాలే. ఇన్నేళ్ల వారి శ్రమ బూడిదలో పోసిన పన్నీరవుతుంది. అందుకే రాజమౌళి సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.

ఆర్ఆర్ఆర్ మూవీని అందరూ అనుకున్న జూలై 31న కాకుండా… 2021 సంక్రాంతికి రిలీజ్ చేయాలని రాజమౌళి డిసైడ్ అయినట్టు సమాచారం. ఇందుకు సహేతుక కారణం కూడా రాజమౌళి చెబుతున్నాడట.

ఇటీవల సంక్రాంతికి విడుదలైన ‘సరిలేరు’, అల వైకుంఠపురం’ చిత్రాలు రెండు కలిసి ఏకంగా 400 కోట్ల వసూళ్లు సాధించాయి. సినిమాలు కాస్త హిట్ అన్న టాక్ తోనే ఇంతటి వసూళ్లు వచ్చాయి. ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాకు అయితే 1000 కోట్లు దాటడం ఖాయం.

అందుకే భారీ బడ్జెట్, భారీ తారాగణం ఉన్న ఆర్ఆర్ఆర్ మూవీకి భారీ కలెక్షన్లు రావాలంటే సంక్రాంతి సీజనే బెటర్ అని రాజమౌళి డిసైడ్ అయ్యాడట.. దేశంలోని 10 భాషల్లో రిలీజ్ చేయనున్న ఈ మూవీకి దానికి తగ్గట్టు కలెక్షన్లు రావాలంటే సంక్రాంతికి షిప్ట్ కావడమే బెటర్ అని 2021 సంక్రాంతికి ఆర్ఆర్ఆర్ ముహూర్తం పెట్టినట్టు తెలిసింది.