Telugu Global
Cinema & Entertainment

చిరంజీవితో పని పూర్తిచేసిన రెజీనా

చిరంజీవి, కొరటాల శివ సినిమా సెట్స్ పైకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం కోకాపేటలో భారీ సెట్ నిర్మించారు. ఈ సెట్ లోనే షూట్ మొదలైంది. ఇప్పుడా షెడ్యూల్ ను యూనిట్ కంప్లీట్ చేసింది. తొలి షెడ్యూల్ లో భాగంగా రెజీనాపై ఓ స్పెషల్ సాంగ్ తీశారు. చిరంజీవి-రెజీనా ఈ పాటకు అదిరిపోయే స్టెప్పులు వేశారట. భాస్కరభట్ల రాసిన ఈ పాటకు మణిశర్మ మంచి ఫోక్ బీట్ అందించాడు. ఈ పాట షూటింగ్ పూర్తిచేయడంతో పాటు […]

చిరంజీవితో పని పూర్తిచేసిన రెజీనా
X

చిరంజీవి, కొరటాల శివ సినిమా సెట్స్ పైకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం కోకాపేటలో భారీ సెట్ నిర్మించారు. ఈ సెట్ లోనే షూట్ మొదలైంది. ఇప్పుడా షెడ్యూల్ ను యూనిట్ కంప్లీట్ చేసింది. తొలి షెడ్యూల్ లో భాగంగా రెజీనాపై ఓ స్పెషల్ సాంగ్ తీశారు. చిరంజీవి-రెజీనా ఈ పాటకు అదిరిపోయే స్టెప్పులు వేశారట. భాస్కరభట్ల రాసిన ఈ పాటకు మణిశర్మ మంచి ఫోక్ బీట్ అందించాడు.

ఈ పాట షూటింగ్ పూర్తిచేయడంతో పాటు రెజీనాపై కొన్ని సన్నివేశాలు కూడా చిత్రీకరించారు. అటు చిరంజీవి, మరికొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులపై కూడా కొన్ని సీన్లు తీశారు. సెకెండ్ షెడ్యూల్ వివరాల్ని త్వరలోనే అధికారికంగా వెల్లడించబోతున్నారు. ఈ సినిమాను వంద రోజుల్లోగా పూర్తిచేయాలని కొరటాలకు టార్గెట్ పెట్టాడు చిరంజీవి. సరిలేరు నీకెవ్వరు ఫంక్షన్ లో మాట్లాడుతూ.. నిండు సభలో కొరటాలను అలా లాక్ చేశాడు. కాబట్టి ఎట్టిపరిస్థితుల్లో ఈ సినిమాను వంద రోజుల్లో పూర్తిచేయాల్సిందే.

కొణెదల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్లపై చిరంజీవి, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. సినిమాలో రామ్ చరణ్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. యంగ్ చిరంజీవి గెటప్ లో చరణ్ కనిపించబోతున్నాడు. దసరాకు ఈ సినిమాను రిలీజ్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు.

First Published:  30 Jan 2020 9:37 AM GMT
Next Story