Telugu Global
Cinema & Entertainment

పవన్-క్రిష్ మూవీ మొదలైంది

రీఎంట్రీలో స్పీడ్ పెంచాడు పవన్ కల్యాణ్. ఒకప్పుడు పవన్ నుంచి ఏడాదికో సినిమా రావడం చాలా కష్టమైన వ్యవహారం. అలాంటిది రీఎంట్రీలో ఇప్పుడు ఏకంగా ఒకేసారి 2 సినిమాలు లైన్లో పెట్టాడు పవర్ స్టార్. పింక్ రీమేక్ ను ఆల్రెడీ సెట్స్ పైకి తీసుకొచ్చిన ఈ మెగా హీరో, ఈరోజు క్రిష్ దర్శకత్వంలో సినిమాను ప్రారంభించాడు. హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ సినిమా పూజా కార్యక్రమం లాంఛనంగా ప్రారంభమైంది. ఫిబ్రవరి మొదటి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ […]

పవన్-క్రిష్ మూవీ మొదలైంది
X

రీఎంట్రీలో స్పీడ్ పెంచాడు పవన్ కల్యాణ్. ఒకప్పుడు పవన్ నుంచి ఏడాదికో సినిమా రావడం చాలా కష్టమైన వ్యవహారం. అలాంటిది రీఎంట్రీలో ఇప్పుడు ఏకంగా ఒకేసారి 2 సినిమాలు లైన్లో పెట్టాడు పవర్ స్టార్. పింక్ రీమేక్ ను ఆల్రెడీ సెట్స్ పైకి తీసుకొచ్చిన ఈ మెగా హీరో, ఈరోజు క్రిష్ దర్శకత్వంలో సినిమాను ప్రారంభించాడు.

హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ సినిమా పూజా కార్యక్రమం లాంఛనంగా ప్రారంభమైంది. ఫిబ్రవరి మొదటి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తారు. సెకండ్ షెడ్యూల్ నుంచి పవన్ జాయిన్ అవుతాడు. కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు. జ్ఞానశేఖర్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తాడు. ప్రగ్యాజైశ్వాల్ ను హీరోయిన్ గా తీసుకున్నారనే ప్రచారం సాగుతున్నప్పటికీ అదింకా కన్ ఫర్మ్ కాలేదు.

ఫిబ్రవరి నుంచి ఈ 2 సినిమాల్ని సైమల్టేనియస్ గా పూర్తిచేస్తాడు పవన్. సమ్మర్ తర్వాత పింక్ రీమేక్ ను రిలీజ్ చేసి, క్రిష్ తో చేయబోయే సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి సిద్ధం చేస్తాడు. స్వతంత్ర ఉద్యమానికి ముందు జరిగిన కథతో ఈ సినిమా రాబోతోంది.

First Published:  29 Jan 2020 11:51 PM GMT
Next Story