Telugu Global
National

జగన్, మోడీ... చంద్రబాబుకు ఇప్పుడు క్లారిటీ వస్తుంది...

కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ఎటువైపు నిలబడ్డారో తేలే సమయం వచ్చేసింది. కేంద్రంలో మోడీ సర్కారు కొలువైనప్పటి నుంచి వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ చాలా సాన్నిహిత్యాన్ని కేంద్రంతో మెయింటేన్ చేస్తున్నారు. మోడీని కలుస్తూ రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర సంస్థలను, నిధులను రాబట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే వీరి స్నేహానికి అసలు సిసలు పరీక్ష ఇప్పుడు ఎదురుకాబోతోంది. మరో వైపు ప్రతిపక్ష చంద్రబాబు కూడా ఎన్నికల ముందు మోడీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి… ఓడిపోయాక తత్త్వం […]

జగన్, మోడీ... చంద్రబాబుకు ఇప్పుడు క్లారిటీ వస్తుంది...
X

కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ఎటువైపు నిలబడ్డారో తేలే సమయం వచ్చేసింది. కేంద్రంలో మోడీ సర్కారు కొలువైనప్పటి నుంచి వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ చాలా సాన్నిహిత్యాన్ని కేంద్రంతో మెయింటేన్ చేస్తున్నారు. మోడీని కలుస్తూ రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర సంస్థలను, నిధులను రాబట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే వీరి స్నేహానికి అసలు సిసలు పరీక్ష ఇప్పుడు ఎదురుకాబోతోంది.

మరో వైపు ప్రతిపక్ష చంద్రబాబు కూడా ఎన్నికల ముందు మోడీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి… ఓడిపోయాక తత్త్వం బోధపడి తన పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులను బీజేపీలోకి సాగనంపి శరణు వేడాడని…. బీజేపీతో చంద్రబాబు రాజీ చేసుకొని దోస్తీ చేసుకున్నాడని ప్రచారమూ జరిగింది.

ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రధాని మోడీ ఎటువైపు..? బీజేపీ స్టాండ్ ఏంటన్నది తేలబోతోంది. ఒక వైపు సీఎం జగన్ ఏపీ శాసనమండలిని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. దీన్ని ఎలాగైనా మూడు నెలల్లోనే ఆమోదించుకొని రాజధానిని మార్చాలని కృతనిశ్చయంతో ఉన్నారు జగన్.

మరోవైపు ఎలాగైనా ఈ బిల్లును ఆపివేయించి రాజధానిని మార్చకుండా చేయాలని చంద్రబాబూ లాబీయింగ్ మొదలు పెట్టారట.. ఈ నేపథ్యంలో కేంద్రం వైఖరేంటి? ప్రధాని మోడీ, హోంమంత్రి షాలు జగన్ వైపు నిలబడుతారా? చంద్రబాబు వెంట నిలుస్తారా? అన్నది ఉత్కంఠగా మారింది.

ఎవరి మాట నెగ్గితే వారిదే భవిష్యత్ రాజకీయ బంధం అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.. సో ఈ పరిణామాలు ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి.

First Published:  30 Jan 2020 3:02 AM GMT
Next Story