Telugu Global
Cinema & Entertainment

రాజమౌళి హిట్ ఫార్ములా ఇదే.... సీనియర్ హీరో కామెంట్స్

రాజమౌళి. బాహుబలి సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ మూవీతోనూ అదే సంచలనం సృష్టించడానికి రెడీ అయ్యాడు. తన మొదటి సినిమా నుంచి బాహుబలి వరకు సక్సెస్ సీక్రెట్ ఏంటి? రాజమౌళి హిట్ ఫార్ములా ఏంటనేది అందరిలోనూ ఆసక్తి కలిగించే అంశమే. ఇప్పుడా హిట్ ఫార్ములాను బయటపెట్టాడు తెలుగు సీనియర్ హీరో. ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోగా వెలుగు వెలిగి అనంతరం కనుమరుగై… ఇప్పుడు దక్షిణాదిలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్న నటుడు సుమన్ […]

రాజమౌళి హిట్ ఫార్ములా ఇదే.... సీనియర్ హీరో కామెంట్స్
X

రాజమౌళి. బాహుబలి సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ మూవీతోనూ అదే సంచలనం సృష్టించడానికి రెడీ అయ్యాడు. తన మొదటి సినిమా నుంచి బాహుబలి వరకు సక్సెస్ సీక్రెట్ ఏంటి? రాజమౌళి హిట్ ఫార్ములా ఏంటనేది అందరిలోనూ ఆసక్తి కలిగించే అంశమే. ఇప్పుడా హిట్ ఫార్ములాను బయటపెట్టాడు తెలుగు సీనియర్ హీరో.

ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోగా వెలుగు వెలిగి అనంతరం కనుమరుగై… ఇప్పుడు దక్షిణాదిలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్న నటుడు సుమన్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలుగులో హాలీవుడ్ ఫార్ములాతో సినిమాలు చేసేది ఒక్క రాజమౌళి మాత్రమేనని నటుడు సుమన్ వ్యాఖ్యానించారు. రాజమౌళి చిత్రాల్లో విలన్ రోల్స్ అద్భుతంగా ఉంటాయన్నారు. మొదట విలన్ డామినేట్ చేయాలి.. ఆ తర్వాత హీరోయిజం ఉండాలి. ఇది ఎప్పటికైనా సక్సెస్ ఫార్ములానే అని సుమన్ అన్నారు.

తమిళంలో శంకర్ అలాంటి పాత్రలే సృష్టిస్తారని.. అందుకే శివాజీలో విలన్ గా చేశానని.. తెలుగులో మాత్రం అలాంటి పవర్ ఫుల్ పాత్రలు నాకు రాలేదని సుమన్ చెప్పుకొచ్చాడు.

First Published:  30 Jan 2020 4:04 AM GMT
Next Story