Telugu Global
NEWS

తెలంగాణలో మళ్లీ ఎన్నికలు.... ‘గడువు కేవలం 15 రోజులు’!

మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను ముగించుకున్న తెలంగాణ మరో ఎన్నికల సమరానికి సిద్ధమవుతోంది. చాలా కాలంగా.. ఇన్ చార్జ్ ల పాలనలోనే ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ దిశగా.. ఉనతాధికారులకు ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. ఇప్పటికే ఊహలకు అందని ఫలితాలు సాధించి.. తెలంగాణ రాజకీయాల్లో పట్టు నిలుపుకొన్న కేసీఆర్.. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలకూ ఇదే సరైన తరుణమని భావిస్తున్నారు. ఆలోచన వచ్చిందే తడవుగా.. అధికారులతో […]

తెలంగాణలో మళ్లీ ఎన్నికలు.... ‘గడువు కేవలం 15 రోజులు’!
X

మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను ముగించుకున్న తెలంగాణ మరో ఎన్నికల సమరానికి సిద్ధమవుతోంది. చాలా కాలంగా.. ఇన్ చార్జ్ ల పాలనలోనే ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ దిశగా.. ఉనతాధికారులకు ఆదేశాలు కూడా జారీ అయ్యాయి.

ఇప్పటికే ఊహలకు అందని ఫలితాలు సాధించి.. తెలంగాణ రాజకీయాల్లో పట్టు నిలుపుకొన్న కేసీఆర్.. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలకూ ఇదే సరైన తరుణమని భావిస్తున్నారు. ఆలోచన వచ్చిందే తడవుగా.. అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రక్రియకు సిద్ధం కావాలని ఆదేశించారు.

4 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యేలా చేసి.. కేవలం 15 రోజుల్లోనే ప్రక్రియ మొత్తం పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఫలితంగా.. యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు.. ఈ ఎన్నికల్లోనూ పట్టు నిలుపుకొనేందుకు టీఆర్ఎస్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.

మున్సిపల్ ఎన్నికల జోష్ లో వీటిని కూడా కవర్ చేసేయాలని ఆరాటపడుతోందని.. అందుకే ఇంత వేగంగా ప్రక్రియ పూర్తికి చర్యలు తీసుకుంటోందని.. ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

తెలంగాణ వ్యాప్తంగా ఉమ్మ‌డి జిల్లాలో ప‌ది డీసీసీబీలు ఉన్నాయి. తొమ్మిది జిల్లాలో 909 ప్రాథ‌మిక స‌హ‌కార సంఘ‌లు ఉన్నాయి. ప్ర‌తి మండ‌లానికి రెండు ప్రాథ‌మిక సంఘాలు ఉండాలని ఇటీవ‌ల ప్ర‌భుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ మేర‌కు కొత్త‌గా 453 సంఘాలు ఏర్పాటు చేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. పాత వాటితో పాటు వీటికి కూడా ఇప్పుడు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

First Published:  29 Jan 2020 10:26 PM GMT
Next Story