Telugu Global
NEWS

భారత్-న్యూజిలాండ్ నాలుగో టీ-20 నేడే

ప్రయోగాలవైపు భారత్ చూపు భారత్- న్యూజిలాండ్ జట్ల పాంచ్ పటాకా టీ-20 సిరీస్ షో…హామిల్టన్ నుంచి వెలింగ్టన్ కు చేరుకొంది. మొదటి మూడుమ్యాచ్ లు నెగ్గడం ద్వారా ఇప్పటికే 3-0తో సిరీస్ ఖాయం చేసుకొన్న భారత్…వరుసగా నాలుగో విజయానికి గురిపెట్టింది. వెలింగ్టన్ వెస్ట్ ప్యాక్ స్టేడియం వేదికగా మరికాసేపట్లో ప్రారంభమయ్యే ఈ నాలుగో మ్యాచ్ లో పలువురు సీనియర్లకు విశ్రాంతినిచ్చి యువఆటగాళ్లకు అవకాశమివ్వడం ద్వారా ప్రయోగాలు చేయాలని భారత టీమ్ మేనేజ్ మెంట్ భావిస్తోంది. మరోవైపు మూడో టీ-20లో విజయం […]

భారత్-న్యూజిలాండ్ నాలుగో టీ-20 నేడే
X
  • ప్రయోగాలవైపు భారత్ చూపు

భారత్- న్యూజిలాండ్ జట్ల పాంచ్ పటాకా టీ-20 సిరీస్ షో…హామిల్టన్ నుంచి వెలింగ్టన్ కు చేరుకొంది. మొదటి మూడుమ్యాచ్ లు నెగ్గడం ద్వారా ఇప్పటికే 3-0తో సిరీస్ ఖాయం చేసుకొన్న భారత్…వరుసగా నాలుగో విజయానికి గురిపెట్టింది.

వెలింగ్టన్ వెస్ట్ ప్యాక్ స్టేడియం వేదికగా మరికాసేపట్లో ప్రారంభమయ్యే ఈ నాలుగో మ్యాచ్ లో పలువురు సీనియర్లకు విశ్రాంతినిచ్చి యువఆటగాళ్లకు అవకాశమివ్వడం ద్వారా ప్రయోగాలు చేయాలని భారత టీమ్ మేనేజ్ మెంట్ భావిస్తోంది.

మరోవైపు మూడో టీ-20లో విజయం అంచుల వరకూ వచ్చి పరాజయం చవిచూసిన ఆతిథ్య న్యూజిలాండ్ మాత్రం..చివరి రెండుమ్యాచ్ ల్లో నెగ్గడం ద్వారా పరువు దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉంది.

భారతజట్టులో రెండుమార్పులు…

కివీ గడ్డపై తొలిసారిగా టీ-20 సిరీస్ నెగ్గిన జోష్ తో ఉన్న భారతజట్టు …తుదిజట్టులో రెండు లేదా మూడు మార్పులు చేసే అవకాశం ఉంది. ఫాస్ట్ బౌలర్లు శార్దూల్ ఠాకూర్ లేదా మహ్మద్ షమీల స్థానంలో మరో యువఫాస్ట్ బౌలర్ నవదీప్ సైనీకి చోటు కల్పించే అవకాశం లేకపోలేదు. రవీంద్ర జడేజా స్థానంలో ఆఫ్ స్పిన్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్, మనీష్ పాండే స్థానంలో సంజు శాంసన్ లకు చోటు కల్పించే అవకాశం ఉంది. జట్టులో ఒకటి లేదా రెండు మార్పులు చేసినా… జైత్రయాత్రను
కొనసాగించాలన్న పట్టుదలతో విరాట్ ఉరకలేస్తున్నాడు.

కివీ విజయాల అడ్డా వెలింగ్టన్…

మరోవైపు..తన విజయాల అడ్డా వెలింగ్టన్ స్టేడియంలో వరుసగా ఏడో విజయానికి ఆతిథ్య న్యూజిలాండ్ గురిపెట్టింది. స్వింగ్ ఆల్ రౌండర్ గ్రాండ్ హోమీ స్థానంలో.. పేస్ ఆల్ రౌండర్ టామ్ బ్రూస్ ను తుదిజట్టులోకి తీసుకోవాలని భావిస్తోంది.

కెప్టెన్ కేన్ విలియమ్స్ సన్, ఓపెనర్ మార్టిన్ గప్టిల్ సూపర్ ఫామ్ లో ఉండడంతో న్యూజిలాండ్ …సరికొత్త ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది.

బ్యాటింగ్ తో పాటు పేస్ బౌలింగ్ కు అనువుగా ఉండే వెలింగ్టన్ స్టేడియంలో 180 కి పైగా స్కోరు సాధించిన జట్టుకే విజయావకాశాలు ఉంటాయి.

భారత్ 4- న్యూజిలాండ్ 4

కివీగడ్డపై భారత్-న్యూజిలాండ్ జట్లు ఇప్పటి వరకూ ఎనిమిదిసార్లు తలపడగా రెండుజట్లు చెరో నాలుగు విజయాలతో సమఉజ్జీలుగా నిలిచాయి.

ఇప్పటికే సిరీస్ ఫలితం తేలిపోయినా…వెలింగ్టన్ మ్యాచ్ ను మాత్రం రెండుజట్లూ ప్రతిష్టాత్మకంగా తీసుకోని పోరుకు సిద్ధం కావడంతో రంజుగా జరిగే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమవుతుంది.

First Published:  30 Jan 2020 10:10 PM GMT
Next Story