Telugu Global
NEWS

విశాఖ... అమరావతి... మధ్యలో ఓ పోస్టు కార్డు

విశాఖ సరే.. అమరావతి సరే.. మధ్యలో ఈ పోస్టు కార్డు ఏంటి అనుకోకండి. అసలు విషయం తెలుసుకోండి. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ.. టీడీపీ నేతలు చాలా రోజులుగా ప్రజల్లో తిరుగుతూనే ఉన్నారు. ఇటు.. వైసీపీ ప్రభుత్వం మాత్రం.. మూడు రాజధానుల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో.. తమ వాదనలో బలాన్ని నిరూపించుకునేందుకు వైసీపీ నేతలు ఓ అడుగు ముందుకు వేశారు. మంత్రి కన్నబాబు.. విశాఖ కోసం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పోస్టు కార్డు ఉద్యమాన్ని […]

విశాఖ... అమరావతి... మధ్యలో ఓ పోస్టు కార్డు
X

విశాఖ సరే.. అమరావతి సరే.. మధ్యలో ఈ పోస్టు కార్డు ఏంటి అనుకోకండి. అసలు విషయం తెలుసుకోండి. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ.. టీడీపీ నేతలు చాలా రోజులుగా ప్రజల్లో తిరుగుతూనే ఉన్నారు. ఇటు.. వైసీపీ ప్రభుత్వం మాత్రం.. మూడు రాజధానుల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో.. తమ వాదనలో బలాన్ని నిరూపించుకునేందుకు వైసీపీ నేతలు ఓ అడుగు ముందుకు వేశారు.

మంత్రి కన్నబాబు.. విశాఖ కోసం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పోస్టు కార్డు ఉద్యమాన్ని మొదలుపెట్టారు. తానే స్వయంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు పోస్టు కార్డు పంపారు. అందులో.. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేసేందుకే అని.. బలమైన కారణాన్ని వివరించారు. పార్టీ కేడర్ లో మరింత ఉత్సాహాన్ని నింపారు. ప్రజలకు మంచి చేయాలని అనుకుంటుంటే.. టీడీపీ అడ్డు పడుతోందని ఆరోపించారు.

ఈ పరిణామాలను గమనిస్తుంటే.. అమరావతి పరిధిలో టీడీపీ నేతలు మాత్రం కాస్త గట్టిగానే పోరాడుతున్నారని అనిపిస్తోంది. జనం పెద్దగా వచ్చినా రాకున్నా.. మీడియాలో చూపించినంత స్పందన ఉన్నా లేకున్నా పట్టింపు లేకుండా.. ఆందోళనలు కొనసాగిస్తున్నారని అర్థమవుతోంది.

ఇలాంటి వేళ.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా.. పోస్ట్ కార్డ్ ఉద్యమంతో ముందుకు వచ్చింది. విశాఖనే కార్య నిర్వాహక రాజధానిగా కొనసాగించేందుకు అవసరమైన అన్ని చర్యలనూ తీసుకుంటోంది.

First Published:  30 Jan 2020 10:13 PM GMT
Next Story