Telugu Global
National

కేరళపై కరోనా కాటు... జాగ్రత్తగా ఉండకుంటే తప్పదు పోటు

అనుకున్నంతా అయ్యింది. అదీ మన దక్షిణ భారత దేశంలోనే వెలుగుచూసింది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ప్రాణాంతక వైరస్.. మన దేశంలోకి ప్రవేశించింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ కూడా ధృవీకరించింది. చైనాలోని కరోనా ప్రభావిత వుహాన్ నగరంలో చదువుకుంటున్న కేరళ విద్యార్థి.. ఇటీవలే స్వదేశానికి తిరిగి వచ్చారు. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు.. ఆ విద్యార్థికి వైద్య పరీక్షలు చేయించారు. విచారణలో..  కరోనా వైరస్ సోకిందని నిర్ధారించారు. ప్రస్తుతం ఆ విద్యార్ధి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని.. ఆందోళన […]

కేరళపై కరోనా కాటు... జాగ్రత్తగా ఉండకుంటే తప్పదు పోటు
X

అనుకున్నంతా అయ్యింది. అదీ మన దక్షిణ భారత దేశంలోనే వెలుగుచూసింది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ప్రాణాంతక వైరస్.. మన దేశంలోకి ప్రవేశించింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ కూడా ధృవీకరించింది. చైనాలోని కరోనా ప్రభావిత వుహాన్ నగరంలో చదువుకుంటున్న కేరళ విద్యార్థి.. ఇటీవలే స్వదేశానికి తిరిగి వచ్చారు.

విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు.. ఆ విద్యార్థికి వైద్య పరీక్షలు చేయించారు. విచారణలో.. కరోనా వైరస్ సోకిందని నిర్ధారించారు. ప్రస్తుతం ఆ విద్యార్ధి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు భరోసా ఇచ్చారు. కానీ.. ఎందుకైనా మంచిదని అబ్జర్వేషన్ కొనసాగిస్తున్నారు.

ఇప్పటికే వందల మంది జనాలు.. ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలు విడిచారు. చైనా నుంచి కేరళకు చేరుకున్న కరోనా వైరస్.. మన దేశ ప్రజలనూ ఆందోళనకు గురి చేస్తోంది. ఏ మాత్రం ఆరోగ్యం ఇబ్బందిగా ఉన్నా.. వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిదన్న సందేశాన్ని అందరికీ పంపిస్తోంది. అజాగ్రత్తకు.. భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వచ్చేకంటే ముందే.. అప్రమత్తంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోండని హెచ్చరిస్తోంది.

First Published:  30 Jan 2020 9:12 PM GMT
Next Story