Telugu Global
NEWS

ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ సెమీస్ లో ఫెదరర్ అవుట్

ఫైనల్లో నొవాక్ జోకోవిచ్ కొత్తసంవత్సరం తొలి గ్రాండ్ స్లామ్ టోర్నీ ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్స్ కు డిఫెండింగ్ చాంపియన్, రెండో సీడ్ నొవాక్ జోకోవిచ్ చేరుకొన్నాడు. రికార్డు స్థాయిలో ఎనిమిదో ఆస్ట్ర్రేలియన్ టైటిల్ కు గురిపెట్టాడు. మెల్బోర్న్ రాడ్ లేవర్ ఎరీనా సెంటర్ కోర్టు వేదికగా ముగిసిన తొలి సెమీఫైనల్లో ఆరుసార్లు విజేత, మూడో సీడ్ రోజర్ ఫెదరర్ ను వరుస సెట్లలో అధిగమించాడు. జోకోవిచ్ 7-6, 6-4, 6-3 విజయంతో ఫైనల్లో అడుగుపెట్టాడు. ఓ […]

ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ సెమీస్ లో ఫెదరర్ అవుట్
X
  • ఫైనల్లో నొవాక్ జోకోవిచ్

కొత్తసంవత్సరం తొలి గ్రాండ్ స్లామ్ టోర్నీ ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్స్ కు డిఫెండింగ్ చాంపియన్, రెండో సీడ్ నొవాక్ జోకోవిచ్ చేరుకొన్నాడు. రికార్డు స్థాయిలో ఎనిమిదో ఆస్ట్ర్రేలియన్ టైటిల్ కు గురిపెట్టాడు.

మెల్బోర్న్ రాడ్ లేవర్ ఎరీనా సెంటర్ కోర్టు వేదికగా ముగిసిన తొలి సెమీఫైనల్లో ఆరుసార్లు విజేత, మూడో సీడ్ రోజర్ ఫెదరర్ ను వరుస సెట్లలో అధిగమించాడు.

జోకోవిచ్ 7-6, 6-4, 6-3 విజయంతో ఫైనల్లో అడుగుపెట్టాడు. ఓ గ్రాండ్ స్లామ్ టె్న్నిస్ టోర్నీ ఫైనల్స్ చేరడం మాజీ నంబర్ వన్ జోకోవిచ్ కు ఇది 50వసారి కావడం విశేషం.

38 సంవత్సరాల ఫెదరర్ పై 32 ఏళ్ల జోకోవిచ్ కు ఇది 27వ గెలుపు. 2012 తర్వాత నుంచి జోకోవిచ్ తో తలపడిన ప్రతిసారీ ఫెదరర్ పరాజయాలు చవిచూడాల్సి వస్తోంది.

రిటైర్మెంట్ ఆలోచన లేని ఫెదరర్..

38 సంవత్సరాల లేటు వయసులోను గ్రాండ్ స్లామ్ టైటిల్ నెగ్గే సత్తా తనలో ఇంకా ఉందని 20 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ విన్నర్ రోజర్ ఫెదరర్ గట్టిగా భావిస్తున్నాడు.

ఆస్ట్ర్రేలియన్ ఓపెన్ సెమీస్ లో తన పోటీ ముగిసినా…తన గ్రాండ్ స్లామ్ వేట కొనసాగిస్తానని, తనలో రిటైర్మెంట్ ఆలోచనలేనే లేదని ప్రకటించాడు.

First Published:  30 Jan 2020 9:24 PM GMT
Next Story