Telugu Global
National

మండలి రద్దు బిల్లు... పార్లమెంటు ముందుకు వచ్చేనా?

శాసనమండలిని ప్రభుత్వం రద్దు చేయాలని నిర్ణయించడం.. తర్వాత ఆ ప్రతిపాదనకు శాసనసభ ఆమోదం తెలపడం.. అక్కడి నుంచి కేంద్రానికి సంబంధిత ప్రతిపాదన చేరడం వరకూ అన్నీ సజావుగానే జరిగాయి. ఇప్పుడు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి. దాదాపు 45 బిల్లులను కేంద్రం.. ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టడానికి సిద్ధం చేసింది. అందులో.. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దు బిల్లుకు చోటు ఇచ్చిందా… లేదా అన్నది మాత్రం అర్థం కాని పరిస్థితి ఉంది. ప్రస్తుత సమావేశాల్లో.. కీలకమైన ద్రవ్య, విత్తన, పెస్టిసైడ్స్ […]

మండలి రద్దు బిల్లు... పార్లమెంటు ముందుకు వచ్చేనా?
X

శాసనమండలిని ప్రభుత్వం రద్దు చేయాలని నిర్ణయించడం.. తర్వాత ఆ ప్రతిపాదనకు శాసనసభ ఆమోదం తెలపడం.. అక్కడి నుంచి కేంద్రానికి సంబంధిత ప్రతిపాదన చేరడం వరకూ అన్నీ సజావుగానే జరిగాయి. ఇప్పుడు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి. దాదాపు 45 బిల్లులను కేంద్రం.. ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టడానికి సిద్ధం చేసింది. అందులో.. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దు బిల్లుకు చోటు ఇచ్చిందా… లేదా అన్నది మాత్రం అర్థం కాని పరిస్థితి ఉంది.

ప్రస్తుత సమావేశాల్లో.. కీలకమైన ద్రవ్య, విత్తన, పెస్టిసైడ్స్ మేనేజ్ మెంట్, నేషనల్ పోలీసు యూనివర్సిటీ, ఫొరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ, ఆర్ బీఐ చట్ట సవరణ, బ్యాంకింగ్ రెగ్యులేటరీ చట్ట సవరణ లాంటి చాలా బిల్లులు సభల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీటి మధ్యలో.. ఏపీ మండలి రద్దుకు సంబంధించిన బిల్లు తమ దృష్టికి రాలేదని పార్లమెంటు అధికారులు చెబుతున్నారు.

కానీ.. సభ ముందుకు ఈ బిల్లు వచ్చే విషయాన్ని కూడా వారు కొట్టిపారేయడం లేదు. ఎందుకంటే.. కేంద్రం ఎక్కడా.. ఏపీ మండలి బిల్లును పట్టించుకోనట్టు చెప్పలేదని.. ఈ కారణంగా సభ ముందుకు బిల్లు వచ్చే అవకాశాలను కొట్టి పారేయలేమని అంటున్నారు. ఇవాళ బడ్జెట్ రోజు సందర్భంగా.. ప్రస్తుతానికి మండలి రద్దు బిల్లు పార్లమెంటు ముందుకు వచ్చే అవకాశాలు లేకున్నా.. రేపటి నుంచి మాత్రం ఆ పరిస్థితి లేదు.

కానీ.. కేంద్రం ఆలోచన తీరుపైనే.. మండలి బిల్లు కదలిక ఆధారపడి ఉంది. ఇప్పటివరకూ.. రాష్ట్ర బీజేపీ నేతలు కూడా.. మండలి రద్దుకు వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువ. రాజధాని వ్యవహారంలోనే వారు అభ్యంతరాలు చెబుతున్నారు తప్ప.. జనాల్లోకి రావడం లేదు. ఈ కారణంగా.. మండలి రద్దు బిల్లు.. పార్లమెంటుకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని.. విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

First Published:  1 Feb 2020 12:24 AM GMT
Next Story