Telugu Global
Cinema & Entertainment

అశ్వథ్థామ ఫస్ట్ డే కలెక్షన్

తన సొంత బ్యానర్ పై నాగశౌర్య హీరోగా నటించిన అశ్వథ్థామ సినిమా నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాకు మొదటి రోజు వరల్డ్ వైడ్ 3 కోట్ల 60 లక్షల గ్రాస్ వచ్చినట్టు మేకర్స్ ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు అటుఇటుగా కోటి రూపాయల షేర్ వచ్చింది. మార్కెట్లో మరో సినిమా లేకపోవడంతో ఈ వీకెండ్ అశ్వథ్థామకు మంచి వసూళ్లు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే సినిమాకు మొదటి రోజే మిక్స్ డ్ టాక్ రావడం […]

అశ్వథ్థామ ఫస్ట్ డే కలెక్షన్
X

తన సొంత బ్యానర్ పై నాగశౌర్య హీరోగా నటించిన అశ్వథ్థామ సినిమా నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాకు మొదటి రోజు వరల్డ్ వైడ్ 3 కోట్ల 60 లక్షల గ్రాస్ వచ్చినట్టు మేకర్స్ ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు అటుఇటుగా కోటి రూపాయల షేర్ వచ్చింది.

మార్కెట్లో మరో సినిమా లేకపోవడంతో ఈ వీకెండ్ అశ్వథ్థామకు మంచి వసూళ్లు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే సినిమాకు మొదటి రోజే మిక్స్ డ్ టాక్ రావడం యూనిట్ ను ఇబ్బంది పెడుతోంది. సోమవారం నుంచి ఈ సినిమా పరిస్థితేంటనేది అయోమయంగా మారింది.

ఓవరాల్ లెక్కలు ఓసారి చూసుకుంటే.. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను 6 కోట్ల రూపాయలకు (అడ్వాన్స్ లతో కలిపి) అమ్మారు. ఫస్ట్ వీకెండ్ గడిచేసరికి (3 రోజుల్లో) ఈ సినిమాకు ఏపీ, నైజాంలో రెండున్నర కోట్ల రూపాయల షేర్ వచ్చేలా కనిపిస్తోంది. సో.. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఈ సినిమా కచ్చితంగా మరో వీకెండ్ వరకు నిలబడాలి. అది సాధ్యమా అనేది కాలమే నిర్ణయించాలి.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు మొదటి రోజు వచ్చిన వసూళ్లు ఇలా ఉన్నాయి

  • నైజాం – 29 లక్షలు
  • సీడెడ్ – 10 లక్షలు
  • ఉత్తరాంధ్ర – 14 లక్షలు
  • ఈస్ట్ – 7 లక్షలు
  • వెస్ట్ – 6 లక్షలు
  • గుంటూరు – 6 లక్షల 20 వేలు
  • కృష్ణా – 7 లక్షల 70వేలు
  • నెల్లూరు – 3 లక్షల 50వేలు
First Published:  1 Feb 2020 5:52 AM GMT
Next Story