Telugu Global
International

చైనా నుంచి మనవాళ్లు వచ్చేశారు... కానీ…!

చైనాలో పుట్టి ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వైరస్ ప్రభావం.. రోజు రోజుకూ పెరుగుతోంది. అందుకే.. అక్కడి నుంచి చాలా మంది విదేశీయులు.. తమ దేశాల బాట పడుతున్నారు. పలు దేశాలు.. తమ వారిని చైనా నుంచి తీసుకువచ్చేందుకు ప్రత్యేక విమానాలు పంపిస్తున్నాయి. ఇందులో భాగంగా.. చైనాలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న హుబి రాష్ట్రం నుంచి మన వాళ్లు ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానంలో ఇవాళ ఉదయం ఢిల్లీ చేరుకున్నారు. హుబి ప్రావిన్సులో మొత్తం 600 మందికి […]

చైనా నుంచి మనవాళ్లు వచ్చేశారు... కానీ…!
X

చైనాలో పుట్టి ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వైరస్ ప్రభావం.. రోజు రోజుకూ పెరుగుతోంది. అందుకే.. అక్కడి నుంచి చాలా మంది విదేశీయులు.. తమ దేశాల బాట పడుతున్నారు. పలు దేశాలు.. తమ వారిని చైనా నుంచి తీసుకువచ్చేందుకు ప్రత్యేక విమానాలు పంపిస్తున్నాయి. ఇందులో భాగంగా.. చైనాలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న హుబి రాష్ట్రం నుంచి మన వాళ్లు ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానంలో ఇవాళ ఉదయం ఢిల్లీ చేరుకున్నారు.

హుబి ప్రావిన్సులో మొత్తం 600 మందికి పైగా భారతీయులు ఉన్నట్టు ఓ అంచనా. వారిలో దాదాపు 400 మంది స్వదేశానికి వచ్చేందుకు ఆసక్తి చూపారు. తాము చైనాలో భయం భయంగా బతకలేకపోతున్నామని కేంద్రానికి నివేదించారు. వెంటనే స్పందించిన కేంద్రం.. హుబికి ప్రత్యేక విమానం పంపింది. అందులో.. 324 మందిని ఢిల్లీకి ఇవాళ ఉదయం తీసుకువచ్చింది. మిగిలిన వారి కోసం మరో విమానం ఈ రోజు హుబికి బయల్దేరింది.

ఇవాళ భారత్ కు చేరుకున్న వారిలో.. ఆంధ్రప్రదేశ్ కు చెందిన 56 మంది.. తెలంగాణకు చెందిన ఐదుగురు ఉన్నట్టు తెలుస్తోంది. వీరితో పాటుగా.. ఢిల్లీ చేరుకున్న అందరినీ.. హరియాణా లోని మానేసర్ కు తరలించారు. అక్కడ సైన్యం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆరోగ్య కేంద్రంలో.. అందరికీ వైద్య పరీక్షలు చేయనున్నారు. కరోనా లక్షణాలు కనిపిస్తే.. వెంటనే బేస్ హాస్పిటల్ దిల్లీ కంటోన్మెంటుకు పంపి ప్రత్యేక పర్యవేక్షణలో చికిత్స చేస్తారు.

వైరస్ లక్షణాలు లేనివారిని మానేసర్ కే పరిమితం చేస్తారు. ఎవరికీ సమస్య లేదు.. అని నిర్ధారించుకున్న 14 రోజుల తర్వాతే… వారిని స్వగ్రామాలకు తరలిస్తారని తెలుస్తోంది. మరోవైపు.. దేశంలోని చాలా ప్రాంతాల్లో కరోనా అనుమానిత కేసులపైనా.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

First Published:  1 Feb 2020 12:09 AM GMT
Next Story