Telugu Global
Cinema & Entertainment

డిస్కోరాజా ఫస్ట్ వీక్ కలెక్షన్

రవితేజ కెరీర్ లో మరో ఫ్లాప్ వచ్చి చేరింది. సరిగ్గా వారం తిరిగేసరికి డిస్కోరాజా దుకాణం సర్దేశాడు. వీఐ ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులు కనెక్ట్ కాలేదు. ఫలితంగా విడుదలైన రెండో రోజు నుంచే థియేటర్లలో ఆక్యుపెన్సీ పడిపోయింది. వరల్డ్ వైడ్ ఈ సినిమాకు 7 రోజుల్లో కేవలం 7 కోట్ల రూపాయల షేర్ మాత్రమే వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు వారం రోజుల్లో 6 కోట్ల 38 లక్షల రూపాయల షేర్ […]

డిస్కోరాజా ఫస్ట్ వీక్ కలెక్షన్
X

రవితేజ కెరీర్ లో మరో ఫ్లాప్ వచ్చి చేరింది. సరిగ్గా వారం తిరిగేసరికి డిస్కోరాజా దుకాణం సర్దేశాడు. వీఐ ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులు కనెక్ట్ కాలేదు. ఫలితంగా విడుదలైన రెండో రోజు నుంచే థియేటర్లలో ఆక్యుపెన్సీ పడిపోయింది.

వరల్డ్ వైడ్ ఈ సినిమాకు 7 రోజుల్లో కేవలం 7 కోట్ల రూపాయల షేర్ మాత్రమే వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు వారం రోజుల్లో 6 కోట్ల 38 లక్షల రూపాయల షేర్ మాత్రమే వచ్చింది. ఏపీ, నైజాంలో ఈ సినిమాను కాస్త అటుఇటుగా 15 కోట్ల రూపాయలకు అమ్మారు. సో.. బయ్యర్లందరికీ సగానికి పైగా నష్టాలు తప్పేలా లేవు. తెలుగు రాష్ట్రాల్లో డిస్కోరాజాకు
వారం రోజుల్లో వచ్చిన వసూళ్లు ఇలా ఉన్నాయి.

నైజాం – రూ. 2.70 కోట్లు
సీడెడ్ – 90 లక్షలు
ఉత్తరాంధ్ర – 89 లక్షలు
ఈస్ట్ – 48 లక్షలు
వెస్ట్ – 38 లక్షలు
గుంటూరు – 40 లక్షలు
నెల్లూరు – 25 లక్షలు
కృష్ణా – 38 లక్షలు

First Published:  1 Feb 2020 5:36 AM GMT
Next Story