Telugu Global
National

విశాఖ జోన్ ఊసు లేదు... రాజధాని మాట లేదు... తెలంగాణ ప్రస్తావనే లేదు!

కేంద్రం మరోసారి తెలుగు రాష్ట్రాలపై చిన్నచూపే చూసిందని విమర్శలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలోనూ సంక్షేమం కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో.. ప్రోత్సాహకర కేటాయింపులు చేయాల్సిన కేంద్రం.. ఆ దిశగా ఎలాంటి నిర్ణయాన్ని వెలువరించకపోవడం.. ప్రజల్లో అసంతృప్తిని పెంచుతోంది. సుదీర్ఘంగా ప్రసంగించిన రికార్డును సొంతం చేసుకున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. తెలుగు రాష్ట్రాలకు మాత్రం కేటాయింపుల్లో అలాంటి రికార్డు సృష్టించనేలేదన్న అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తే.. రాజధాని లేదు. తాజాగా.. మూడు […]

విశాఖ జోన్ ఊసు లేదు... రాజధాని మాట లేదు... తెలంగాణ ప్రస్తావనే లేదు!
X

కేంద్రం మరోసారి తెలుగు రాష్ట్రాలపై చిన్నచూపే చూసిందని విమర్శలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలోనూ సంక్షేమం కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో.. ప్రోత్సాహకర కేటాయింపులు చేయాల్సిన కేంద్రం.. ఆ దిశగా ఎలాంటి నిర్ణయాన్ని వెలువరించకపోవడం.. ప్రజల్లో అసంతృప్తిని పెంచుతోంది. సుదీర్ఘంగా ప్రసంగించిన రికార్డును సొంతం చేసుకున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. తెలుగు రాష్ట్రాలకు మాత్రం కేటాయింపుల్లో అలాంటి రికార్డు సృష్టించనేలేదన్న అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తే.. రాజధాని లేదు. తాజాగా.. మూడు రాజధానుల ప్రతిపాదనలు వచ్చాయి. అలాంటి రాష్ట్రానికి.. అధికారిక కార్యాలయాల ఏర్పాటుకు పెద్ద స్థాయిలో భవనాలు, వసతులు కావాలి. అయినా.. కేంద్రం మాట మాత్రంగా కూడా ఎలాంటి ప్రస్తావన చేయకుండా కేటాయింపుల లెక్కలు పూర్తి చేసింది. విభజన చట్టంలో ఇచ్చిన హామీలని ఈ సారి కూడా పట్టించుకోనట్టుగానే వ్యవహరించారు.

విశాఖ రైల్వే జోన్ గురించీ కేంద్రం ప్రస్తావించకపోవడంపై సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతోంది. అసంబద్ధంగా ఈ జోన్ ను ఏర్పాటు చేశారని ఇప్పటికే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు కేటాయింపులూ లేవన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. రైల్వే మంత్రి ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పే వివరాల్లో ఏమైనా ఉంటే తప్ప.. ఈ ఏడాది కూడా విశాఖ జోన్ పనులకు కేంద్రం ప్రాధాన్యత ఇవ్వనట్టే లెక్క.. అని నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు.

ఇక.. తెలంగాణకు కేంద్రం కేటాయింపుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదన్నట్టుగా మంత్రి నిర్మల ప్రసంగం ఉంది. తాము 22 సంస్థల ఏర్పాటుపై ప్రతిపాదనలు ఇస్తే… ఒక్కటంటే ఒక్క సంస్థ పైనా కేంద్రం స్పష్టత ఇవ్వలేదని… తెలంగాణ ఎంపీ ప్రభాకర్ రెడ్డి చేసిన విమర్శ… అక్కడి నాయకుల ఆవేదనను వ్యక్త పరుస్తోంది.

మొత్తానికి ఈ ఏడాది కూడా… కేంద్ర బడ్జెట్ లో తెలుగు రాష్ట్రాలకు మాత్రం ప్రాధాన్యత కరువైందన్న విషయం స్పష్టమైంది.

First Published:  1 Feb 2020 9:07 PM GMT
Next Story