Telugu Global
NEWS

న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్ కు పాండ్యా అన్ ఫిట్

2018 సెప్టెంబర్ 18 నుంచి టెస్ట్ జట్టుకు దూరం భారత డాషింగ్ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా మరోసారి భారత టెస్టు జట్టుకు దూరమయ్యాడు. వెన్నెముక గాయం నుంచి 26 సంవత్సరాల పాండ్యా ఇంకా పూర్తిగా కోలుకోలేదని… లండన్ లో అతనికి శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యుడు డాక్టర్ జేమ్స్ అల్లీబోన్ తేల్చిచెప్పారు. ఐదుమాసాల క్రితం చివరిసారిగా భారత జట్టు తరపున వన్డే, టీ-20 సిరీస్ ల్లో పాల్గొన్న హార్థిక్ పాండ్యా ఆ తర్వాత వెన్నెముక నొప్పితో జట్టు నుంచి […]

న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్ కు పాండ్యా అన్ ఫిట్
X
  • 2018 సెప్టెంబర్ 18 నుంచి టెస్ట్ జట్టుకు దూరం

భారత డాషింగ్ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా మరోసారి భారత టెస్టు జట్టుకు దూరమయ్యాడు. వెన్నెముక గాయం నుంచి 26 సంవత్సరాల పాండ్యా ఇంకా పూర్తిగా కోలుకోలేదని… లండన్ లో అతనికి శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యుడు డాక్టర్ జేమ్స్ అల్లీబోన్ తేల్చిచెప్పారు.

ఐదుమాసాల క్రితం చివరిసారిగా భారత జట్టు తరపున వన్డే, టీ-20 సిరీస్ ల్లో పాల్గొన్న హార్థిక్ పాండ్యా ఆ తర్వాత వెన్నెముక నొప్పితో జట్టు నుంచి ఉపసంహరించుకొన్నాడు.

శస్త్రచికిత్స అవసరమని డాక్టర్లు చెప్పడంతో…లండన్ వెళ్లి మరీ ఆపరేషన్ చేయించుకొని …పునరావాస కార్యక్రమం తర్వాత తాను పూర్తి ఫిట్ నెస్ సాధించినట్లు ప్రకటించడంతో…న్యూజిలాండ్ తో టూర్ కు సెలెక్టర్లు ఎంపిక చేశారు.

న్యూజిలాండ్ తో టీ-20 సిరీస్ ప్రారంభానికి ముందే పాండ్యా ఫిట్ కాదని మరోసారి తేలిపోయింది. ఐదుమ్యాచ్ ల టీ-20 సిరీస్ కు పాండ్యా స్థానంలో మరో ఆల్ రౌండర్ శివం దూబేకు చోటు కల్పించారు. అయినా పాండ్యా నూటికి నూరుశాతం ఫిట్ నెస్ తో లేకపోడంతో మరోసారి నిపుణుల సలహా కోసం లండన్ తీసుకెళ్లారు.

మొత్తం మీద…న్యూజిలాండ్ తో తర్వలో జరిగే రెండుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కు సైతం పాండ్యా అందుబాటులో ఉండబోడనని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.

First Published:  1 Feb 2020 9:05 PM GMT
Next Story