Telugu Global
National

కేవీపీకి, సుబ్బరామిరెడ్డికి మ‌ళ్లీ చాన్స్ ఇస్తారా ?

కేవీపీ రామచంద్రారావు, టి.సుబ్బరామిరెడ్డి. రాజ్యసభ సభ్యులు. వీరి రాజ్య‌స‌భ ప‌ద‌వీ కాలం మార్చి నెలతో ముగుస్తోంది. దీంతో మళ్లీ ఈ ఇద్దరు నేతలు పెద్దల సభకు వెళ్లేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారట. కేవీపీ రామచంద్రారావు ఈ మధ్య కాంగ్రెస్‌ రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటున్నారు. తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో కూడా ఎక్స్‌ ఆఫిషియో ఓటు వేసేందుకు నేరేడుచర్ల వెళ్లారు. అయితే అక్కడ గులాబీ దళం వేసిన ఎత్తుతో ఆయన చిత్తయ్యారు. ఆయన తెలంగాణ కోటాలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. […]

కేవీపీకి, సుబ్బరామిరెడ్డికి మ‌ళ్లీ చాన్స్ ఇస్తారా ?
X

కేవీపీ రామచంద్రారావు, టి.సుబ్బరామిరెడ్డి. రాజ్యసభ సభ్యులు. వీరి రాజ్య‌స‌భ ప‌ద‌వీ కాలం మార్చి నెలతో ముగుస్తోంది. దీంతో మళ్లీ ఈ ఇద్దరు నేతలు పెద్దల సభకు వెళ్లేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారట.

కేవీపీ రామచంద్రారావు ఈ మధ్య కాంగ్రెస్‌ రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటున్నారు. తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో కూడా ఎక్స్‌ ఆఫిషియో ఓటు వేసేందుకు నేరేడుచర్ల వెళ్లారు. అయితే అక్కడ గులాబీ దళం వేసిన ఎత్తుతో ఆయన చిత్తయ్యారు. ఆయన తెలంగాణ కోటాలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. దీంతో ఓటు వేసేందుకు వెళ్లారు. ఈ మూవ్‌మెంట్‌ ద్వారా ఆయన కాంగ్రెస్‌ అధిష్టానం దృష్టిలో పడేందుకు ప్రయత్నం చేశారని గుసగుసలు విన్పిస్తున్నాయి. కాంగ్రెస్‌ ప్రయోజనాలు కాపాడడమే తనకు ముఖ్యమని…అందుకే నేరేడుచర్ల దాకా వెళ్లానని కేవీపీ చెబుతున్నారు. ఈ విషయం ద్వారా కాంగ్రెస్‌ హైకమాండ్‌కు ఆయన ఈ సందేశం పంపారని అంటున్నారు.

ప్రస్తుతం కేవీపీ రాజ్యసభకు వెళ్లాలంటే ఏపీ నుంచి సాధ్యం కాదు. అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేరు. తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యేలు జంప్‌ అయ్యారు. మిగతా ఎమ్మెల్యేలతో రాజ్యసభకు వెళ్లలేరు. దీంతో ఆయన పక్క రాష్ట్రాల వైపు చూస్తున్నారు. కర్నాటక లేదా మహారాష్ట్ర లేకపోతే మరో రాష్ట్రం నుంచి రాజ్యసభకు తనను పంపాలని కాంగ్రెస్‌ హైకమాండ్‌ ను ఆయన కోరుతున్నారట.

ఇటు సుబ్బారామిరెడ్డి కూడా పెద్దల సభలో మరోసారి అడుగుపెట్టేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారట. ఈయనకు కూడా తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే చాన్స్‌ లేదు. దీంతో ఈయన కూడా పక్క రాష్ట్రాల నుంచి ప్రపోజల్‌ పెట్టాలని కాంగ్రెస్‌ పెద్దలను కోరుతున్నారట. ఇప్పటికే తనను చత్తీస్‌గడ్‌ నుంచి పంపించాలని అధిష్టానానికి విజ్ఞప్తి చేశారట. ఆ రాష్ట్రానికి వెళ్లి అక్కడి కాంగ్రెస్‌ నేతలను కలిశారట. ఆ రాష్ట్రం నుంచి రాజ్యసభకు వెళ్లేందుకు గ్రౌండ్‌ ప్రిపేర్‌ చేసుకున్నారని చెబుతున్నారు.

మొత్తానికి ఈ ఇద్దరు రాజ్యసభ ఎంపీలు తిరిగి పెద్దల సభకు వెళ్లేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారట. మరి కాంగ్రెస్‌ అధిష్టానం వీరి వినతిని మన్నించి వేరే రాష్ట్రం నుంచి పెద్దల సభకు పంపుతుందో లేదో చూడాలి.

First Published:  2 Feb 2020 7:00 AM GMT
Next Story