Telugu Global
Cinema & Entertainment

నిఖిల్ నిశ్చితార్థం

అవును.. మీరు చదివింది నిజమే. ఎలాంటి చడీచప్పుడు లేకుండా, ముందస్తు ప్రకటన చేయకుండా ఎంగేజ్ మెంట్ పూర్తిచేసుకున్నాడు నిఖిల్. తన కాబోయే భార్యతో దిగిన ఫొటోల్ని సోషల్ మీడియాలో రిలీజ్ చేశాడు. ఇప్పుడు మేటర్ లోకి వెళ్దాం.. కొన్నాళ్లుగా నిఖిల్ ప్రేమలో ఉన్నాడనే పుకార్లు ఉన్నాయి. ఓ తెలుగమ్మాయితో అతడు డేటింగ్ చేస్తున్నాడనే ఊహాగానాలు ఏడాదిగా నలుగుతూనే ఉన్నాయి. ఎట్టకేలకు ఆ రూమర్లు నిజమయ్యాయి. నిఖిల్ ఆ అమ్మాయితోనే పెళ్లికి సిద్ధమౌతున్నాడు. అమ్మాయి పేరు పల్లవి వర్మ. […]

నిఖిల్ నిశ్చితార్థం
X

అవును.. మీరు చదివింది నిజమే. ఎలాంటి చడీచప్పుడు లేకుండా, ముందస్తు ప్రకటన చేయకుండా ఎంగేజ్ మెంట్ పూర్తిచేసుకున్నాడు నిఖిల్. తన కాబోయే భార్యతో దిగిన ఫొటోల్ని సోషల్ మీడియాలో రిలీజ్ చేశాడు. ఇప్పుడు మేటర్ లోకి వెళ్దాం..

కొన్నాళ్లుగా నిఖిల్ ప్రేమలో ఉన్నాడనే పుకార్లు ఉన్నాయి. ఓ తెలుగమ్మాయితో అతడు డేటింగ్ చేస్తున్నాడనే ఊహాగానాలు ఏడాదిగా నలుగుతూనే ఉన్నాయి. ఎట్టకేలకు ఆ రూమర్లు నిజమయ్యాయి. నిఖిల్ ఆ అమ్మాయితోనే పెళ్లికి సిద్ధమౌతున్నాడు. అమ్మాయి పేరు పల్లవి వర్మ. స్వస్థలం భీమవరం. వృత్తి వైద్యురాలు.

ఇంట్లో తల్లిదండ్రుల్ని ఒప్పించి మరీ పెళ్లి చేసుకుంటున్నాడు నిఖిల్. గోవాలా నిన్న నిఖిల్-పల్లవి నిశ్చితార్థం జరిగింది. ఏప్రిల్ 16న హైదరాబాద్ లో వీళ్లు పెళ్లి చేసుకోబోతున్నారు. అలా నిఖిల్ కూడా త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడన్నమాట.

First Published:  2 Feb 2020 10:02 AM GMT
Next Story