భార్య తల నరికాడు.. జాతీయ గీతం పాడాడు

కాస్త వింతగా అనిపించే.. మరి కాస్త భయంగా అనిపించే వార్త ఇది. ఉత్తర ప్రదేశ్ లో జరిగిన ఈ దారుణం.. ఎంతో మందిని కదిలించింది. భార్యను చంపిన భర్త… ఆమె తలను, మొండాన్ని వేరు చేయడమే కాదు.. పోలీసులకు అప్పగించాడు. ఆ తర్వాత.. జాతీయ గీతాన్ని పాడుతూ పోలీసులనే విస్మయానికి గురి చేశాడు.

ఈ సంఘటన… ఉత్తరప్రదేశ్ జహంగీరాబాద్ పరిధిలోని బహదూర్ పూర్ లో జరిగింది. అక్కడి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బహదూర్ పుర గ్రామానికి చెందిన అఖిలేష్ రావత్ అనే వ్యక్తి.. తన భార్యతో చిన్నపాటి గొడవ పడ్డాడు. ఆ వాగ్వాదమే.. చినికి చినికి గాలి వాన అయ్యింది. ఇద్దరి మధ్యా ఘర్షణ పూరిత వాతావరణం సృష్టించింది.

మాటా మాటా పెరిగిన కారణంగా.. అఖిలేష్ రావత్.. ఆవేశంతో ఊగిపోయాడు. తన భార్యపై తీవ్రమైన ఆగ్రహాన్ని చూపించాడు. ఆమెను దారుణంగా హతమార్చాడు. అప్పటికీ శాంతించని రావత్.. భార్య శరీరాన్ని ముక్కలు చేశాడు. తలను మొండాన్ని వేరు చేశాడు. ఆ వెంటనే పోలీసుల ఎదుట లొంగిపోయేందుకు.. భార్య తలతో సహా బయల్దేరాడు.

ఈ విషయం.. ఆనోటా ఈ నోటా పోలీసులకు చేరింది. వెంటనే దారి కాచి.. అతడిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. కానీ.. వారితో రావత్ వాగ్వాదానికి దిగాడు. అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ వెళ్లి.. తన భార్య తలను అప్పగించాడు. ఆ వెంటనే జాతీయగీతాన్ని పాడి.. అందరినీ విస్మయానికి గురి చేశాడు.