Telugu Global
NEWS

ఈ నెల 6న సీఎం జగన్ తో చిరంజీవి భేటీ?

ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ఓ ఆసక్తికరమైన ఊహాగానం.. హాట్ హాట్ గా చక్కర్లు కొడుతోంది. ఈ నెల 6న.. కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి.. ముఖ్యమంత్రి జగన్ ను కలవనున్నారన్న సమాచారం.. అందరిలో ఆసక్తిని పెంచుతోంది. ఇటీవలే.. సైరా నరసింహారెడ్డి సినిమా విడుదల సందర్భంగా.. జగన్ ను స్వయంగా కలిసిన చిరంజీవి.. తన సినిమా చూడాలని ఆహ్వానించడం అందరికీ గుర్తుండే ఉంటుంది. తర్వాత.. ఇటీవల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ డైరీ విడుదల సందర్భంగా కూడా.. చిరంజీవి.. ముఖ్యమంత్రి […]

ఈ నెల 6న సీఎం జగన్ తో చిరంజీవి భేటీ?
X

ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ఓ ఆసక్తికరమైన ఊహాగానం.. హాట్ హాట్ గా చక్కర్లు కొడుతోంది. ఈ నెల 6న.. కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి.. ముఖ్యమంత్రి జగన్ ను కలవనున్నారన్న సమాచారం.. అందరిలో ఆసక్తిని పెంచుతోంది. ఇటీవలే.. సైరా నరసింహారెడ్డి సినిమా విడుదల సందర్భంగా.. జగన్ ను స్వయంగా కలిసిన చిరంజీవి.. తన సినిమా చూడాలని ఆహ్వానించడం అందరికీ గుర్తుండే ఉంటుంది.

తర్వాత.. ఇటీవల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ డైరీ విడుదల సందర్భంగా కూడా.. చిరంజీవి.. ముఖ్యమంత్రి ప్రస్తావన తెచ్చారు. పరిశ్రమ బాగు కోసం.. ఏదైనా చేయడానికి సీఎం సిద్ధంగా ఉన్నారంటూ.. ఆ విషయాన్ని తనకు జగన్ చెప్పారంటూ.. చిరంజీవి వివరించారు. ఈ విషయం కూడా అందరికీ గుర్తుండే ఉంటుంది.

తర్వాత.. 3 రాజధానుల ప్రతిపాదన వచ్చిన తర్వాత.. ఆ నిర్ణయాన్ని సమర్ధిస్తూ చిరంజీవి ప్రకటన విడుదల చేయడమూ గుర్తుండే ఉంటుంది.

ఇన్ని పరిణామాల నేపథ్యంలో.. చిరంజీవి.. జగన్ ను కలుస్తున్నారంటే.. ఏదో విషయం ఉండే ఉంటుందని అంతా అనుకుంటున్నారు. కాంగ్రెస్ కు దూరంగా ఉంటున్న చిరంజీవి.. రాజకీయాలపై ఆసక్తి పోని కారణంగానే వైసీపీతో కలిసి నడవాలని భావిస్తున్నారేమో.. అని కొన్ని మీడియాల్లో వార్తలొచ్చాయి.

ఈ గుసగుసలపై… మెగా క్యాంప్ నుంచి మాత్రం మరో సమాచారం లీక్ అయ్యింది. కేవలం నంది అవార్డుల వ్యవహారంలో మాత్రమే.. సినిమా పరిశ్రమ తరఫున.. ముఖ్యమంత్రిని చిరంజీవి కలవనున్నారని తెలుస్తోంది. ఇందులో వాస్తవాలు ఏంటో తెలియాలంటే.. ఇద్దరి సమావేశం వరకూ ఆగాల్సిందే. లేదంటే.. ఇరువర్గాల్లో ఎవరినుంచైనా అధికారిక ప్రకటన రావాల్సిందే.

First Published:  2 Feb 2020 2:26 AM GMT
Next Story