Telugu Global
Cinema & Entertainment

అశ్వథ్థామ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్

అశ్వథ్థామ నుంచి మరో పోస్టర్ వచ్చేసింది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 3 కోట్ల 60 లక్షల రూపాయల గ్రాస్ వచ్చినట్టు ప్రకటించిన మేకర్స్.. ఫస్ట్ వీకెండ్ గడిచేసరికి ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల 35 లక్షల రూపాయల గ్రాస్ వచ్చినట్టు ప్రకటించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. మరో 2-3 రోజుల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయిపోతుందని చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను అడ్వాన్స్ లతో కలుపుకొని 6 కోట్ల రూపాయలకు అమ్మారు. మొదటి రోజు కోటి […]

అశ్వథ్థామ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్
X

అశ్వథ్థామ నుంచి మరో పోస్టర్ వచ్చేసింది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 3 కోట్ల 60 లక్షల రూపాయల గ్రాస్ వచ్చినట్టు ప్రకటించిన మేకర్స్.. ఫస్ట్ వీకెండ్ గడిచేసరికి ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల 35 లక్షల రూపాయల గ్రాస్ వచ్చినట్టు ప్రకటించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. మరో 2-3 రోజుల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయిపోతుందని చెబుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను అడ్వాన్స్ లతో కలుపుకొని 6 కోట్ల రూపాయలకు అమ్మారు. మొదటి రోజు కోటి రూపాయల షేర్ వచ్చింది. 3 రోజులకు 3 కోట్లు వచ్చాయని అనుకున్నప్పటికీ.. 2-3 రోజుల్లో ఇదెలా బ్రేక్-ఈవెన్ అవుతుందో మేకర్స్ కే తెలియాలి. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఈ సినిమా కచ్చితంగా మరో వీకెండ్ వరకు నిలబడాలి.

అటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. యూఎస్ఏలో ఇప్పటికీ మహేష్, బన్నీ సినిమాలకే వసూళ్లు వస్తున్నాయి. మిగతా ఏ సినిమాకు కలెక్షన్లు రావడం లేదు. సో.. అశ్వథ్థామ అసలైన రెవెన్యూ తెలియాలంటే ఫస్ట్ వీక్ కంప్లీట్ అయ్యేంత వరకు ఎదురుచూడాల్సిందే.

First Published:  3 Feb 2020 6:00 AM GMT
Next Story