ఈసారి అన్నీ రీమేక్స్ చేస్తున్న దిల్ రాజు

మొన్నటివరకు రీమేక్స్ కు వ్యతిరేకం అన్నాడు. కానీ ఇప్పుడు ఒకేసారి 3 రీమేక్స్ హ్యాండిల్ చేస్తున్నాడు. కంటెంట్ బాగుంటే రీమేక్ చేయడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదంటున్నాడు దిల్ రాజు

“ఇప్పటివరకు రీమేక్స్ చేయలేదు. చేయడం మొదలుపెట్టానో లేదో ఇదే ఏడాది ఏకంగా 3 రీమేక్స్. పింక్ రీమేక్ దీంతో పాటు జాను, హిందీలో కూడా జెర్సీ రీమేక్ చేస్తున్నాం. మూడు కూడా హార్ట్ టచింగ్ సినిమాలు.. జస్ట్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలు కావు.”

ఇక జాను గురించి మాట్లాడుతూ… రీమేక్ కు ఎలాంటి మార్పులు చేయలేదని స్పష్టం చేశాడు దిల్ రాజు. తమిళ వర్షన్ కి తెలుగు ‘జాను’ కి ఎక్కడా మార్పులు ఉండవని.. కాకపోతే తమిళంలో విజయ్ సేతుపతి చాలా స్లోగా మాట్లాడతాడని.. తెలుగులో వచ్చేసరికి శర్వానంద్ కొంచెం స్పీడ్ గా మాట్లాడతాడని స్పష్టంచేశాడు. జాను టైటిల్ వెనక సీక్రెట్ కూడా బయటపెట్టాడు.

“ఈ సినిమాకి టైటిల్ అనుకున్న తరవాత ప్రభాస్ సినిమా ప్రొడ్యూసర్స్ తో మాట్లాడా. వాళ్ళు సరే అన్నారు. ఆ సినిమా రావాడానికి ఇంకా టైముంది కాబట్టి టైటిల్ ప్రాబ్లమ్ ఏం ఉండదనిపించింది. అయినా అది ప్రభాస్ సినిమా… ఆయన సినిమాకి టైటిల్ అవసరం లేదు.. ఆయన చాలు.”

ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి వస్తోంది జాను. శర్వానంద్, సమంత హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను 96 అనే తమిళ సినిమా ఆధారంగా తెరకెక్కించారు.