Telugu Global
NEWS

టీ-20 సిరీస్ లో కివీస్ కు భారత్ బ్రౌన్ వాష్

5-0తో సిరీస్ గెలుపుతో భారత్ ప్రపంచ రికార్డు ప్రపంచకప్ కు సన్నాహకంగా న్యూజిలాండ్ తో జరిగిన ఐదుమ్యాచ్ ల టీ-20 సిరీస్ ను భారత్ 5-0తో నెగ్గడం ద్వారా బ్రౌన్ వాష్ సాధించింది. ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్ చరిత్రలోనే ఐదుమ్యాచ్ ల సిరీస్ లో క్లీన్ స్వీప్ సాధించిన తొలిజట్టుగా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. బే ఓవల్ వేదికగా ముగిసిన ఆఖరి టీ-20 మ్యాచ్ లో భారత్ 7 పరుగులతో కివీలను అధిగమించింది. భారత్ విజయంలో ప్రధానపాత్ర […]

టీ-20 సిరీస్ లో కివీస్ కు భారత్ బ్రౌన్ వాష్
X
  • 5-0తో సిరీస్ గెలుపుతో భారత్ ప్రపంచ రికార్డు

ప్రపంచకప్ కు సన్నాహకంగా న్యూజిలాండ్ తో జరిగిన ఐదుమ్యాచ్ ల టీ-20 సిరీస్ ను భారత్ 5-0తో నెగ్గడం ద్వారా బ్రౌన్ వాష్ సాధించింది. ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్ చరిత్రలోనే ఐదుమ్యాచ్ ల సిరీస్ లో క్లీన్ స్వీప్ సాధించిన తొలిజట్టుగా ప్రపంచ రికార్డు నెలకొల్పింది.

బే ఓవల్ వేదికగా ముగిసిన ఆఖరి టీ-20 మ్యాచ్ లో భారత్ 7 పరుగులతో కివీలను అధిగమించింది. భారత్ విజయంలో ప్రధానపాత్ర వహించిన యార్కర్ల కింగ్ జస్ ప్రీత్ బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రాహుల్ కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి.

రోహిత్ 29వ హాఫ్ సెంచరీ…

రోహిత్ శర్మ స్టాండ్ ఇన్ కెప్టెన్ గా బరిలోకి దిగిన భారత్…ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ ఎంచుకొంది. 20 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే నష్టపోయి 163 పరుగుల స్కోరు సాధించింది.

ఓపెనర్ రాహుల్ 45, కెప్టెన్ రోహిత్ 60 పరుగులు, శ్రేయస్ అయ్యర్ 33 పరుగుల స్కోరు సాధించారు. రోహిత్ శర్మ 41 బాల్స్ లో 3 బౌండ్రీలు, 3 సిక్సర్లతో 60 పరుగులు సాధిచండం ద్వారా తన టీ-20 కెరియర్ లో 29వ హాఫ్ సెంచరీ నమోదు చేయగలిగాడు. ఆ తర్వాత గాయంతో రోహిత్ …ఫీల్డింగ్ కు దూరమయ్యాడు.

భారతజట్టుకు ఆట రెండోభాగంలో రాహుల్ కెప్టెన్ గా వ్యవహరించాడు.

కివీస్ పోరాటం వృధా..

164 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన న్యూజిలాండ్ 9 వికెట్లకు 156 పరుగులు మాత్రమే చేయగలిగింది. సీఫెర్ట్, రోజ్ టేలర్ హాఫ్ సెంచరీలు సాధించినా ప్రయోజనం లేకపోయింది.

తన కెరియర్ లో 100వ టీ-20 మ్యాచ్ ఆడిన మాజీ కెప్టెన్ రోజ్ టేలర్ 47 బాల్స్ లో 5 బౌండ్రీలు, 2 సిక్సర్లతో 53 పరుగులకు అవుట్ కావడంతోనే న్యూజిలాండ్ పరాజయం ఖాయమైపోయింది.

భారత బౌలర్లలో బుమ్రా 4 ఓవర్లలో 12 పరుగులిచ్చి 3 వికెట్లు, సైనీ, శార్ధూల్ ఠాకూర్ చెరో 2 వికెట్లు, వాషింగ్టన్ సుందర్ 1 వికెట్ పడగొట్టారు.

న్యూజిలాండ్ ను న్యూజిలాండ్ గడ్డపై 5-0తో చిత్తు చేయడం ద్వారా భారతజట్టు తొలిసారిగా సిరీస్ గెలుచుకోడమే కాదు…6-4 రికార్డుతో తన ఆధిక్యాన్ని చాటుకోగలిగింది.

న్యూజిలాండ్ తో తీన్మార్ వన్డే సిరీస్ లోని తొలిమ్యాచ్ …ఫిబ్రవరి 5న హామిల్టన్ వేదికగా ప్రారంభంకానుంది.

First Published:  2 Feb 2020 8:01 PM GMT
Next Story