Telugu Global
National

కేంద్ర బడ్జెట్ కు... లక్ష్మీనారాయణ ప్రశంసలు

జనసేన తాజా మాజీ నాయకుడు… మాజీ ఐపీఎస్ లక్ష్మీ నారాయణ… కేంద్ర బడ్జెట్ పై స్పందించారు. ఇది చాలా బాగుందని ప్రశంసించారు. ప్రజా హితంగా ఉందంటూ అభినందించారు. యువతను సాగు వైపు నడిపించేలా పద్దులు రూపొందించారని వ్యాఖ్యానించారు. ఇదంతా చూస్తుంటే… ఆయన బీజేపీ వైపు అడుగులు వేస్తున్నారా… అని ఆలోచించే వారితో పాటు, తన రాజకీయ అడుగులపై కూడా లక్ష్మీ నారాయణ… ఇలా సమాధానం ఇచ్చారు. ప్రజాసేవకు రాజకీయాలే మంచి మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు. తప్పకుండా రాజకీయాల్లో […]

కేంద్ర బడ్జెట్ కు... లక్ష్మీనారాయణ ప్రశంసలు
X

జనసేన తాజా మాజీ నాయకుడు… మాజీ ఐపీఎస్ లక్ష్మీ నారాయణ… కేంద్ర బడ్జెట్ పై స్పందించారు. ఇది చాలా బాగుందని ప్రశంసించారు. ప్రజా హితంగా ఉందంటూ అభినందించారు. యువతను సాగు వైపు నడిపించేలా పద్దులు రూపొందించారని వ్యాఖ్యానించారు. ఇదంతా చూస్తుంటే… ఆయన బీజేపీ వైపు అడుగులు వేస్తున్నారా… అని ఆలోచించే వారితో పాటు, తన రాజకీయ అడుగులపై కూడా లక్ష్మీ నారాయణ… ఇలా సమాధానం ఇచ్చారు.

ప్రజాసేవకు రాజకీయాలే మంచి మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు. తప్పకుండా రాజకీయాల్లో కొనసాగుతా అని చెప్పారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు త్వరలో క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్తున్నట్టు చెప్పారు.

గతంలోనూ.. ఆయన ఊరూరా తిరిగి జనాన్ని కలిసి.. వారితో మాట్లాడి.. అభిప్రాయాలు పంచుకున్నారు. ఇప్పుడు ఏ పార్టీకీ చెందని నేతగా.. మరోసారి జనాల్లోకి వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు.

అలాగే.. పార్టీ మార్పుపైనా లక్ష్మీ నారాయణ స్పందించారు. ఇప్పటివరకూ ఏ పార్టీలో చేరేదీ తేల్చుకోలేదన్నారు. త్వరలోనే ఆ నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెప్పారు. జనసేనలో తన రాజీనామా ఆమోదం పొందిందని… అది ముగిసిన అధ్యాయమని తేల్చి చెప్పారు. ఇక్కడే ఓ విషయం రాజకీయ విశ్లేషకులను, జనాన్ని ఆకర్షిస్తోంది. కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై.. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు.. ప్రజలు కూడా కాస్త అసంతృప్తి చెందారు.

ప్రత్యేక హోదా.. రాజధాని నిర్మాణం.. ప్రాజెక్టులకు, పథకాలకు నిధులు.. వెనుకబడిన జిల్లాలకు పద్దుల్లో నిధుల ప్రస్తావనే చేయని కేంద్రం.. లక్ష్మీనారాయణను ఎలా మెప్పించిందో.. అని ఆలోచిస్తున్నారు.

First Published:  3 Feb 2020 12:14 AM GMT
Next Story