Telugu Global
Cinema & Entertainment

ఈ ఏడాది పవన్ నుంచి 2 సినిమాలు

పవన్ కల్యాణ్ నుంచి ఈ ఏడాది ఏకంగా 2 సినిమాలు రాబోతున్నాయి. ఆ మేరకు పూర్తిస్థాయిలో కాల్షీట్లు సర్దుబాటు చేశాడు పవర్ స్టార్. ముందుగా పింక్ రీమేక్ కు ఆయన 30 రోజుల కాల్షీట్లు ఇచ్చారు. దిల్ రాజు బ్యానర్ పై వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వస్తోంది ఈ సినిమా. ఈ సినిమాకు తాజాగా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. మే 15న ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది. సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. ఉగాదికి […]

ఈ ఏడాది పవన్ నుంచి 2 సినిమాలు
X

పవన్ కల్యాణ్ నుంచి ఈ ఏడాది ఏకంగా 2 సినిమాలు రాబోతున్నాయి. ఆ మేరకు పూర్తిస్థాయిలో కాల్షీట్లు సర్దుబాటు చేశాడు పవర్ స్టార్. ముందుగా పింక్ రీమేక్ కు ఆయన 30 రోజుల కాల్షీట్లు ఇచ్చారు. దిల్ రాజు బ్యానర్ పై వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వస్తోంది ఈ సినిమా.

ఈ సినిమాకు తాజాగా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. మే 15న ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది. సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. ఉగాదికి టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారు. ఈ సినిమాతో పాటు క్రిష్ దర్శకత్వంలో మరో మూవీని కూడా స్టార్ట్ చేశాడు పవన్.

ఏఎం రత్నం నిర్మాణంలో ఈ నెలలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. ఈ సినిమాను దసరా టైమ్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇలా ఈ ఏడాది ఒకేసారి 2 సినిమాల్ని రిలీజ్ చేయాలని పవన్ భావిస్తున్నాడు.

ఇక హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై పవన్ చేయాల్సిన సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ కు ప్లాన్ చేస్తున్నారు. గబ్బర్ సింగ్ రిలీజైన తేదీకే ఈ సినిమా వచ్చే ఛాన్స్ ఉంది.

First Published:  3 Feb 2020 6:02 AM GMT
Next Story