Telugu Global
Cinema & Entertainment

'సరిలేరు' హిట్టవుతుందని నాకు ముందే తెలుసు

సినిమా రిలీజైన 3 వారాలైంది. అయినా సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రచారాన్ని ఆపలేదు. ఏదో ఒక రూపంలో ఈ సినిమాకు ప్రచారం కల్పిస్తూనే ఉన్నారు. తాజాగా ఎక్స్ ట్రా కామెడీ సీన్ కూడా జతచేశారు. ఈసారి ఏకంగా కృష్ణను రంగంలోకి దించారు. సరిలేరు నీకెవ్వరు సినిమా చూసిన కృష్ణ, ఈ మూవీ హిట్టవుతుందనే విషయం తనకు ముందే తెలుసంటున్నాడు. “సరిలేరు నీకెవ్వరు హిట్టవుతుందని నాకు ముందే తెలుసు. ఎందుకంటే ఈ స్టోరీ నేను విన్నాను. తీసిన విధానం […]

సరిలేరు హిట్టవుతుందని నాకు ముందే తెలుసు
X

సినిమా రిలీజైన 3 వారాలైంది. అయినా సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రచారాన్ని ఆపలేదు. ఏదో ఒక రూపంలో ఈ సినిమాకు ప్రచారం కల్పిస్తూనే ఉన్నారు. తాజాగా ఎక్స్ ట్రా కామెడీ సీన్ కూడా జతచేశారు. ఈసారి ఏకంగా కృష్ణను రంగంలోకి దించారు. సరిలేరు నీకెవ్వరు సినిమా చూసిన కృష్ణ, ఈ మూవీ హిట్టవుతుందనే విషయం తనకు ముందే తెలుసంటున్నాడు.

“సరిలేరు నీకెవ్వరు హిట్టవుతుందని నాకు ముందే తెలుసు. ఎందుకంటే ఈ స్టోరీ నేను విన్నాను. తీసిన విధానం కూడా చూశాను. మరీ ముఖ్యంగా మొదటి రోజు సినిమా చూసినప్పుడు బాగా నచ్చింది. ఇంటర్వెల్ వరకు వినోదాత్మకంగా సాగిన సినిమా, ఆ తర్వాత ఎక్కడా ఆగలేదు. క్లైమాక్స్ వరకు ఒకే స్పీడ్ తో వెళ్లింది. సినిమా పెద్ద హిట్టవుతుందని అప్పుడే అనుకున్నాను.”

ఇలా ఎట్టకేలకు సరిలేరు నీకెవ్వరు సినిమాపై స్పందించారు కృష్ణ. ఈ సినిమాలో కృష్ణ ప్రస్తావన ఉంది. 2-3 సన్నివేశాలకు లింక్ కలుపుతూ.. అల్లురి సీతారామరాజు సినిమాలో కృష్ణ డైలాగ్స్ ను వాడుకున్నారు. ఆ ప్రయోగం బాగానే క్లిక్ అయింది. తన క్లిప్పింగుల్ని వాడుకున్న విధానం కూడా తనకు బాగా నచ్చిందంటున్నారు కృష్ణ.

First Published:  3 Feb 2020 12:24 AM GMT
Next Story