Telugu Global
NEWS

విశాఖలో బోలెడన్ని ప్రభుత్వ భూములు.... వివరాలు ఇవిగో...

పరిపాలన రాజధానిగా విశాఖను ఎంపిక చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. నగరంలో ఉన్న భూముల వివరాలు సేకరించింది. విశాఖతో పాటు.. పరిసర గ్రామాల్లో దాదాపు 4 వేల ఎకరాలు వినియోగానికి అనువుగా ఉన్నట్టు గుర్తించింది. బిల్ట్ ఏపీ మిషన్ కింద ఈ వివరాలు సేకరించిన రాష్ట్ర ప్రభుత్వం.. పరిపాలన రాజధానితో పాటు.. కొన్ని భూములు అమ్మి వచ్చే డబ్బులను సంక్షేమ పథకాల అమలుకు వినియోగించే అవకాశం ఉంది. అధికారులు గుర్తించిన వివరాల ప్రకారం.. విశాఖ శివార్లు, పరిసర ప్రాంతాల్లోని […]

విశాఖలో బోలెడన్ని ప్రభుత్వ భూములు.... వివరాలు ఇవిగో...
X

పరిపాలన రాజధానిగా విశాఖను ఎంపిక చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. నగరంలో ఉన్న భూముల వివరాలు సేకరించింది. విశాఖతో పాటు.. పరిసర గ్రామాల్లో దాదాపు 4 వేల ఎకరాలు వినియోగానికి అనువుగా ఉన్నట్టు గుర్తించింది.

బిల్ట్ ఏపీ మిషన్ కింద ఈ వివరాలు సేకరించిన రాష్ట్ర ప్రభుత్వం.. పరిపాలన రాజధానితో పాటు.. కొన్ని భూములు అమ్మి వచ్చే డబ్బులను సంక్షేమ పథకాల అమలుకు వినియోగించే అవకాశం ఉంది.

అధికారులు గుర్తించిన వివరాల ప్రకారం.. విశాఖ శివార్లు, పరిసర ప్రాంతాల్లోని 11 గ్రామాల్లో 2 వేల ఎకరాలు విక్రయానికి, వినియోగానికి అనువుగా ఉన్నాయి. విశాఖ మహా నగర పాలక సంస్థ పరిధిలో 300కు పైగా…. వీఎంఆర్డీఏ పరిధిలో 1700 ఎకరాల వరకూ…. భూములను గుర్తించారు.

విశాఖ గ్రామీణ మండలంలో 900 ఎకరాలు, గాజువాకలో 50, అనకాపల్లిలో వెయ్యి, సీతమ్మధారలో 40, ములగాడలో 80 ఎకరాల ప్రభుత్వ భూములను గుర్తించారు.

ఇతర మండలాల పరిధిలోనూ.. వినియోగానికి, విక్రయానికి అనువుగా ఉన్న భూముల లెక్క తేలుతోంది. వీటిని పూర్తిగా లెక్కించాక.. న్యాయ సమస్యలు లేని ప్రాంతాల భూములను ఏం చేయాలన్నది ప్రభుత్వం త్వరలోనే తేల్చనుంది.

పరిపాలన రాజధానిగా విశాఖను ఎంపిక చేసిన ప్రభుత్వం.. కార్యాలయాల ఏర్పాటుకు, సిబ్బందికి వసతుల కోసం అవసరమైన చర్యలు తీసుకుంటోంది. రాజధాని తరలింపు ఖాయమన్న వార్తల నేపథ్యంలో.. ఇప్పుడు భూముల లెక్కలు కూడా కీలకంగా మారాయి.

అందుబాటులో ఉన్న భూముల వివరాలు తేలిన నేపథ్యంలో.. వాటి వినియోగానికి సంబంధించిన ప్రణాళిక కూడా.. త్వరలోనే వచ్చే అవకాశం ఉంది.

First Published:  3 Feb 2020 3:26 AM GMT
Next Story