మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా అఖిల్

అఖిల్ కొత్త సినిమాకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఈ టైటిల్ పెట్టబోతున్నట్టు 3 రోజుల నుంచి కథనాలు వస్తూనే ఉన్నాయి. అయితే విజయ్ దేవరకొండ నుంచి వరల్డ్ ఫేమస్ లవర్ అనే సినిమా వస్తోంది. అఖిల్ మూవీ టైటిల్ కూడా దాదాపు అదే తరహాలో ఉండడంతో, టైటిల్ మారొచ్చంటూ ఊహాగానాలు వినిపించాయి. కానీ యూనిట్ మాత్రం చెప్పిన టైటిల్ కే ఫిక్స్ అయింది.

ఈ సినిమాలో కూడా లవర్ బాయ్ గా కనిపిస్తున్నాడు అఖిల్. అతడి ప్రేయసిగా పూజా హెగ్డే నటిస్తోంది. ఈరోజు సినిమాకు సంబంధించి టైటిల్ మాత్రమే రిలీజ్ చేశారు. 8వ తేదీ సాయంత్రం 6 గంటల 18 నిమిషాలకు ఫస్ట్ లుక్ రిలీజ్ చేయబోతున్నారు. గోపీసుందర్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.

వరుసగా ఫ్లాపులు వస్తుండడంతో ఈసారి అల్లు అరవింద్ ను నమ్ముకున్నాడు అఖిల్. నాగార్జున దగ్గరుండి ఈ ప్రాజెక్టు సెట్ చేశాడు. కెరీర్ స్టార్ట్ చేసినప్పట్నుంచి ఇప్పటివరకు చేసిన 3 సినిమాలతో ఫ్లాపులిచ్చిన అఖిల్, ఈ కొత్త సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు. అటు దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ కు కూడా లైఫ్ అండ్ డెత్ సినిమా ఇది.