20 నిమిషాల గర్ల్ ఫ్రెండ్… 10 రూపాయలే చార్జ్… కానీ!

గర్ల్ ఫ్రెండ్ ఉండడం ఇప్పుడు సర్వసాధారణం. ఇంకా చెప్పాలంటే ఓ స్టేటస్ సింబల్ అని ఇప్పటి యూత్ అనుకుంటున్నారు. ఆ దేశం… ఈ దేశం అని కాదు. ఏ దేశంలోని యువకుల తీరు చూసినా.. ఇదే మెంటాలిటీ. ఇది కొందరికి వీక్నెస్ గా మారితే.. మరి కొందరికి టైమ్ పాస్. చాలా కొంతమందే.. సిన్సియర్ గా తీసుకుని.. జీవితాంతం కలిసి నడుస్తుంటారు. ఇంతగా.. గర్ల్ ఫ్రెండ్ టాపిక్ యువకులు జీవితాల్లో భాగమైన విషయాన్ని.. చైనాలోని హువాన్ పట్టణంలో ఉన్న వైటలిటీ షాపింగ్ కాంప్లెక్స్ గుర్తించింది.

తమ షాపింగ్ మాల్ మరింత మందిని ఆకర్షించేందుకు.. ముఖ్యంగా యువతీ యువకులను ఆకర్షించేందుకు ఓ ఎత్తుగడ వేసింది. 20 నిమిషాలకు కేవలం 10 రూపాయలు (మన కరెన్సీ ప్రకారం) చెల్లిస్తే.. షాపింగ్ మాల్ లోకి ఓ అమ్మాయిని తోడుగా పంపిస్తారు. ఆ అమ్మాయితో సరదాగా మాట్లాడొచ్చు. కబుర్లు చెప్పొచ్చు. షాపింగ్ లో సహాయం తీసుకోవచ్చు. లగేజ్ పట్టుకోవడంలో సహాయం పొందవచ్చు. పిల్లలు ఉంటే ఎత్తుకోవడానికి అప్పగించవచ్చు.

ఇలా.. చాలా సౌకర్యాలను వైటలిటీ షాపింగ్ కాంప్లెక్స్ కల్పిస్తోంది. ఇదే సమయంలో.. ఆ అమ్మాయిల భద్రత కోసం కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. వారితో ఉన్నప్పుడు కస్టమర్లు ఎలాంటి పరిస్థితుల్లో టచ్ చేయకూడదని.. ప్రైవేట్ ప్రాంతాలకు తీసుకువెళ్లకూడదని.. కాంప్లెక్స్ లో మాత్రమే ఆ జంటలు కలియతిరగాలని రూల్స్ పెట్టారు. అలాగే.. 20 నిమిషాల నిబంధనను కచ్చితంగా అమలు చేస్తున్నారు. సమయం అయిపోగానే.. ఆ అమ్మాయిలు తిరిగి తమ స్థానాలకు చేరుకుంటారు. ఇలా.. దాదాపు 15 మంది అమ్మాయిలను ఇలా వైటలిటీ మాల్.. నియామకం చేసింది.

ఈ ప్లాన్ ఫలించి.. యువకులు చాలా మందే షాపింగ్ మాల్ కు క్యూ కడుతున్నారట. అంతా బానే ఉంది కానీ.. ఈ రూల్స్ ఏంట్రా బాబూ అనుకుంటూ… ఉన్న కాసేపూ.. సరదాగా షాపింగ్ చేసి వెళ్లిపోతున్నారట.