Telugu Global
Cinema & Entertainment

చిరంజీవి సినిమాలో మోహన్ బాబు

కెరీర్ స్టార్టింగ్ లో చిరంజీవి, మోహన్ బాబు కలిసి సినిమాల్లో నటించారు. ఆ తర్వాత చిరంజీవి సుప్రీమ్ హీరోగా కొనసాగిన టైమ్ లో కూడా ఆయన సినిమాల్లో విలన్ పాత్రల్లో కనిపించాడు మోహన్ బాబు. ఎప్పుడైతే మోహన్ బాబుకు కూడా స్టార్ డమ్ వచ్చిందో, అప్పట్నుంచి చిరు-కలెక్షన్ కింగ్ కలిసి నటించలేదు. ఇన్నాళ్లకు వీళ్లిద్దర్నీ మరోసారి తెరపై చూసే అవకాశం వస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే చిరంజీవి సినిమాలో మోహన్ బాబు కనిపించే ఛాన్స్ ఉంది. పైగా […]

చిరంజీవి సినిమాలో మోహన్ బాబు
X

కెరీర్ స్టార్టింగ్ లో చిరంజీవి, మోహన్ బాబు కలిసి సినిమాల్లో నటించారు. ఆ తర్వాత చిరంజీవి సుప్రీమ్ హీరోగా కొనసాగిన టైమ్ లో కూడా ఆయన సినిమాల్లో విలన్ పాత్రల్లో కనిపించాడు మోహన్ బాబు. ఎప్పుడైతే మోహన్ బాబుకు కూడా స్టార్ డమ్ వచ్చిందో, అప్పట్నుంచి చిరు-కలెక్షన్ కింగ్ కలిసి నటించలేదు. ఇన్నాళ్లకు వీళ్లిద్దర్నీ మరోసారి తెరపై చూసే అవకాశం వస్తోంది.

అన్నీ అనుకున్నట్టు జరిగితే చిరంజీవి సినిమాలో మోహన్ బాబు కనిపించే ఛాన్స్ ఉంది. పైగా అది విలన్ పాత్ర. అవును.. కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో మోహన్ బాబు విలన్ గా కనిపిస్తారట. ఈ మేరకు కొరటాల శివ వెళ్లి, మోహన్ బాబుకు స్టోరీ వినిపించారు. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

గతంలో మోహన్ బాబు, చిరంజీవి మధ్య వివాదం నడిచింది. ఎవరు సెలబ్రిటీ, ఎవరు లెజెండ్ అంటూ మాటమాట అనుకున్నారు. కానీ ఆ తర్వాత జరిగిన వివిధ ఘటనల్లో ఇద్దరూ కలిసిపోయారు. రీసెంట్ గా జరిగిన ఓ ఫంక్షన్ లో ఏకంగా మోహన్ బాబును చిరంజీవి ముద్దాడారు. దీంతో వీళ్లిద్దరిమధ్య ఇప్పుడు ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని తేలిపోయింది. సో.. చిరంజీవి సినిమాలో కనిపించడానికి మోహన్ బాబుకు ఎలాంటి అభ్యంతరం ఉండకపోవచ్చు.

First Published:  4 Feb 2020 8:24 AM GMT
Next Story