Telugu Global
Cinema & Entertainment

‘పింక్’ ప్రక్షాళన: పవన్ కోసం దిల్ రాజు భారీ మార్పులు....

ఒక భాషలో భారీ హిట్ అయిన మూవీని మరో భాషలో తీస్తే ఎవరూ దాన్ని మార్చరు. ఉదాహరణకు తెలుగు అర్జున్ రెడ్డిని సందీప్ రెడ్డి వంగా సేమ్ యాజ్ టీజ్ హిందీలో తీసి బ్లాక్ బస్టర్ కొట్టించాడు. కానీ తాజాగా దిల్ రాజ్ మాత్రం పవన్ కళ్యాణ్ తో తీస్తున్న ‘పింక్’ మూవీ రిమేక్ ను పూర్తిగా మార్చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఒరిజినల్ మూవీతో పోలిస్తే పవన్ చేస్తున్న ‘పింక్’ మూవీ రిమేక్ లో భారీ మార్పులు […]

‘పింక్’ ప్రక్షాళన: పవన్ కోసం దిల్ రాజు భారీ మార్పులు....
X

ఒక భాషలో భారీ హిట్ అయిన మూవీని మరో భాషలో తీస్తే ఎవరూ దాన్ని మార్చరు. ఉదాహరణకు తెలుగు అర్జున్ రెడ్డిని సందీప్ రెడ్డి వంగా సేమ్ యాజ్ టీజ్ హిందీలో తీసి బ్లాక్ బస్టర్ కొట్టించాడు. కానీ తాజాగా దిల్ రాజ్ మాత్రం పవన్ కళ్యాణ్ తో తీస్తున్న ‘పింక్’ మూవీ రిమేక్ ను పూర్తిగా మార్చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది.

ఒరిజినల్ మూవీతో పోలిస్తే పవన్ చేస్తున్న ‘పింక్’ మూవీ రిమేక్ లో భారీ మార్పులు చేశారట.. దీనికి కారణం పవన్ కళ్యాణ్ అని టాలీవుడ్ వర్గాలు తెలిపాయి.

పవన్ కళ్యాణ్ తెలుగులో మంచి మాస్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆ ఇమేజ్ కు తగ్గట్టు సినిమా కథను మార్చేస్తున్నారట. రిమేక్ లో పవన్ కళ్యాణ్ సాదాసీదాగా కనిపిస్తే ఆయన ఫ్యాన్స్ జనాలకు నచ్చదు. అందుకే పవన్ ను దృష్టిలో పెట్టుకొని పింక్ రిమేక్ లో భారీ మార్పులు చేస్తున్నట్టు తెలిసింది.

ఒరిజినల్ కథలో అమితాబ్ బచ్చన్ లాయర్ గా పోరాడుతారు. కానీ పవన్ కళ్యాణ్ కోసం భారీ యాక్షన్ సీన్ లను తెలుగులో జోడిస్తున్నారట… రిమేక్ మూవీ కావడం… అందరూ చూసిన సినిమా కావడంతో కొత్తగా చెప్పాలనే పింక్ తెలగు రిమేక్ లో భారీ మార్పులు చేస్తున్నామని నిర్మాత దిల్ రాజు తెలిపారు.

హిందీ, తమిళ్ వెర్షన్లకు పూర్తి భిన్నంగా సినిమా కథను మలిచామని తెలిపారు.

First Published:  4 Feb 2020 1:32 AM GMT
Next Story