Telugu Global
Cinema & Entertainment

అల వైకుంఠపురములో రికార్డ్స్ పోస్టర్

అందరూ ఎదురుచూస్తున్న అరుదైన పోస్టర్ రానే వచ్చింది. అల వైకుంఠపురములో యూనిట్ ఆ పోస్టర్ ను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని అన్ని ఏరియాల్లో తమ సినిమా నాన్-బాహుబలి-2 రికార్డు సృష్టించినట్టు యూనిట్ అధికారికంగా ప్రకటించుకుంది. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అల వైకుంఠపురములో సినిమా ఆల్ టైమ్ హిట్ గా నిలిచినట్టు అందరూ చెప్పుకుంటున్నారు. పనిలోపనిగా ఇది తెలుగు రాష్ట్రాల్లో అన్ని రికార్డుల్ని తుడిచిపెట్టిందని, బాహుబలి-1ను కూడా క్లాస్ చేసి, బాహుబలి-2 తర్వాత […]

అల వైకుంఠపురములో రికార్డ్స్ పోస్టర్
X

అందరూ ఎదురుచూస్తున్న అరుదైన పోస్టర్ రానే వచ్చింది. అల వైకుంఠపురములో యూనిట్ ఆ పోస్టర్ ను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని అన్ని ఏరియాల్లో తమ సినిమా నాన్-బాహుబలి-2 రికార్డు సృష్టించినట్టు యూనిట్ అధికారికంగా ప్రకటించుకుంది.

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అల వైకుంఠపురములో సినిమా ఆల్ టైమ్ హిట్ గా నిలిచినట్టు అందరూ చెప్పుకుంటున్నారు. పనిలోపనిగా ఇది తెలుగు రాష్ట్రాల్లో అన్ని రికార్డుల్ని తుడిచిపెట్టిందని, బాహుబలి-1ను కూడా క్లాస్ చేసి, బాహుబలి-2 తర్వాత స్థానంలో నిలిచిందని చాలామంది కథనాలు రాసుకొచ్చారు. అయితే వీటిపై అధికారికంగా యూనిట్ ఎప్పుడూ రియాక్ట్ అవ్వలేదు.

ఈరోజుతో 25 రోజులు పూర్తిచేసుకుంది అల వైకుంఠపురములో సినిమా. ఈ సందర్భంగా పోస్టర్ ను విడుదల చేస్తూ.. తాము నాన్-బాహుబలి-2 రికార్డులు క్రియేట్ చేసినట్టు అధికారికంగా ప్రకటించింది యూనిట్. ఇప్పటికే నాన్-బాహుబలి రికార్డ్ తమదేనంటూ సరిలేరు నీకెవ్వరు యూనిట్ పోస్టర్ రిలీజ్ చేసింది. మరి ఈ రెండు సినిమాల్లో ఏది రికార్డు సృష్టించిందో ఆ యూనిట్ సభ్యులకే తెలియాలి.

First Published:  5 Feb 2020 3:19 AM GMT
Next Story