ఛీ…. వీడూ ఓ తండ్రేనా?

బెంగళూరు మాగడిరోడ్డు పరిధిలో ఉండే కుమారేష్.. కొన్నేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఓ బాబును కన్నాడు. అసలు విషయం ఏంటంటే.. వీడో రౌడీ షీటర్. ఆ విషయం అమ్మాయి తరఫు వారికి పెళ్లైన తర్వాత తెలిసింది. నాటి నుంచి ఇద్దరి మధ్య గొడవలు సాధారణమయ్యాయి.

బాబు పెరిగి పెద్దవాడవుతున్న తరుణంలో ఈ గొడవలు మరింత ముదురి పాకాన పడ్డాయి. భార్యపై కోపంతో కొడుకును బయటికి తీసుకువెళ్లడం అలవాటు చేసుకున్న కుమారేష్.. తాను స్నేహితులతో కలిసి మద్యం తాగుతూ.. తన కొడుకు చేతా అదే పని చేయించాడు. అక్కడితో ఆగక.. కొడుకు తాగుతున్న దృశ్యాలను వీడియో తీసి తన భార్యకు పంపాడు.

తనను ఇబ్బంది పెడితే సహించిన ఆ యువతి.. కొడుకును కూడా నాశనం చేస్తుండడనాన్ని భరించలేక.. పోలీసులను ఆశ్రయించింది. విషయం తెలుసుకున్న కుమారేష్.. పరారయ్యాడు.