Telugu Global
National

కియాపై తప్పుడు ప్రచారాలు... ఖండించారు అందరూ

విన్నారా.. కియా ఆటో మొబైల్ సంస్థ రాష్ట్రం నుంచి తరలిపోబోతోందట. ఈ విషయాన్ని రాయిటర్స్ అనే అంతర్జాతీయ మీడియా సంస్థ ప్రచురించింది. ఇది విన్న చాలా మంది గగ్గోలు పెట్టారు. ఏంటిది.. అని అనుకున్నారు. వాళ్లూ వీళ్లూ కాదు.. ఆఖరికి కియా సంస్థ యాజమాన్యం కూడా ఈ గుసగుసలపై షాక్ తింది. తాము ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లిపోవాలన్న ఆలోచనేదీ లేదని తేల్చి చెప్పింది. అసలు విషయం ఏంటంటే.. 1.1 బిలియన్ డాలర్ల విలువైన కియా ప్లాంట్ ను.. […]

కియాపై తప్పుడు ప్రచారాలు... ఖండించారు అందరూ
X

విన్నారా.. కియా ఆటో మొబైల్ సంస్థ రాష్ట్రం నుంచి తరలిపోబోతోందట. ఈ విషయాన్ని రాయిటర్స్ అనే అంతర్జాతీయ మీడియా సంస్థ ప్రచురించింది. ఇది విన్న చాలా మంది గగ్గోలు పెట్టారు. ఏంటిది.. అని అనుకున్నారు. వాళ్లూ వీళ్లూ కాదు.. ఆఖరికి కియా సంస్థ యాజమాన్యం కూడా ఈ గుసగుసలపై షాక్ తింది. తాము ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లిపోవాలన్న ఆలోచనేదీ లేదని తేల్చి చెప్పింది.

అసలు విషయం ఏంటంటే.. 1.1 బిలియన్ డాలర్ల విలువైన కియా ప్లాంట్ ను.. తమిళనాడులో ఏర్పాటు చేసేందుకు సంస్థ యాజమాన్యం ఆ రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిందట. ఈ విషయంపై.. అటు తమిళనాడు ప్రభుత్వం కానీ.. ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ.. కనీసం కియా యాజమాన్యం కానీ.. ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ లెక్కన.. ఇలాంటి వార్తను ఎవరైనా ఎలా నమ్మగలరు?

ఇదే విషయాన్ని.. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య, పెట్టుబడుల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ కూడా చెబుతున్నారు. కియా, ఏపీ ప్రభుత్వం కలిసే పని చేస్తున్నాయని ఆయన వెల్లడించారు. రాయిటర్స్ కథనాన్ని తీవ్రంగా ఖండించారు. కియా మోటార్స్ ఇండియా సేల్స్ అండ్ మార్కెటింగ్ హెడ్ మనోహర్ భట్ కూడా ఈ విషయంపై స్పందించారు. ‘ఆంధ్రాలో మా ప్లాంట్ అద్భుతంగా పని చేస్తుంది.. తరలింపు ఆలోచన లేదు’ అని తేల్చేశారు.

అంతటితో ఆగకుండా తమిళనాడు ప్రభుత్వం కూడా కియా ప్లాంట్ ను తమిళనాడుకు తరలించడం లేదని… ఈ విషయంలో ఎలాంటి చర్చలూ జరగలేదని స్పష్టం చేసింది.

మరి ఈ వార్తలు ఎవరు పుట్టిస్తున్నట్టు… ఎందుకు ప్రచారం చేస్తున్నట్టు..?

First Published:  6 Feb 2020 7:36 AM GMT
Next Story