Telugu Global
National

3 రాజధానుల విషయంలో జగన్ విజయం.... జీవీఎల్ వ్యాఖ్యలే సాక్ష్యం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. 3 రాజధానుల విషయంలో విజయం సాధించారు. ఈ విషయం.. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యలు రుజువు చేస్తున్నాయి. 2015లో అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా నోటిఫై చేస్తూ.. కేంద్రం ఇచ్చిన ఉత్తర్వు.. ఎలాంటి శిలాశాసనం కాదని… రాజధాని నిర్ణయం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదే అని స్పష్టం చేశారు.. జీవీఎల్. కేంద్రం ప్రకటన చేసిన ప్రకారం.. నాడు రాష్ట్రప్రభుత్వం కోరింది కాబట్టి నోటిఫై చేశారు కానీ.. అదే శాశ్వతం […]

3 రాజధానుల విషయంలో జగన్ విజయం.... జీవీఎల్ వ్యాఖ్యలే సాక్ష్యం
X

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. 3 రాజధానుల విషయంలో విజయం సాధించారు. ఈ విషయం.. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యలు రుజువు చేస్తున్నాయి. 2015లో అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా నోటిఫై చేస్తూ.. కేంద్రం ఇచ్చిన ఉత్తర్వు.. ఎలాంటి శిలాశాసనం కాదని… రాజధాని నిర్ణయం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదే అని స్పష్టం చేశారు.. జీవీఎల్.

కేంద్రం ప్రకటన చేసిన ప్రకారం.. నాడు రాష్ట్రప్రభుత్వం కోరింది కాబట్టి నోటిఫై చేశారు కానీ.. అదే శాశ్వతం కాదన్న మాటను జీవీఎల్ స్పష్టాతిస్పష్టంగా చెప్పారు. మారిన ప్రభుత్వ అభిప్రాయం ప్రకారం మరో జీవో కూడా విడుదల కావొచ్చని ఆయన తేల్చి చెప్పారు. కేంద్రం రాజకీయాలకు అతీతంగా.. రాజ్యాంగానికి లోబడి మాత్రమే పని చేస్తుందని.. సమాఖ్య స్ఫూర్తిని కాపాడుతుందని స్పష్టం చేశారు.

అమరావతిని నోటిఫై చేసి ఉన్నారు కాబట్టే.. ప్రస్తుత రాజధానిగా అమరావతి అనే మాట్లాడుతున్నారన్న జీవీఎల్.. తర్వాత రాజధానిని రాష్ట్ర ప్రభుత్వం మారిస్తే కేంద్రం జోక్యం చేసుకునే అవకాశం లేదన్నారు. అమరావతి విషయంలోనే కాదు.. మూడు రాజధానుల విషయంలోనూ కేంద్రం జోక్యం చేసుకోబోదని చెప్పారు. రాజకీయాల కోసమే.. అమరావతి పై తెలుగుదేశం రాద్ధాంతం చేస్తోందని స్పష్టం చేశారు.

ఈ విషయంతో.. ఒకటి తేలిపోయింది. మూడు రాజధానులపై జగన్ ప్రభుత్వం ఇక అడుగు ముందుకే వేయనుంది. ఈ విషయంలో ఒంటరిగా మిగిలిన తెలుగుదేశం.. తదుపరి అడుగును ఎలా వేయబోతోందన్నది చూడాలి.

First Published:  6 Feb 2020 7:40 AM GMT
Next Story