Telugu Global
National

తమిళ హీరో విజయ్‌కు ఐటీ 'బిగిల్'

ఈ స్టార్ హీరోలున్నారే…తెరపై డెలాగులు బహుబాగా సెప్తారు కానీ…తెర వెనుక మాత్రం అంతా గప్‌చుప్‌ యవ్వారమే…. అన్న డైలాగ్ ఈ మధ్య కాలంలో తెగ పాపులరైంది. తెలుగులో ఒక హీరో అంతా మనం ఉంచుకోకూడదు… కొంత ఇచ్చేయాలి అంటూ తెగ ఊదరగొట్టే హీరో నిజ జీవితంలో మాత్రం, సమాజానికి ఏం ఇవ్వకపోయినా… కట్టాల్సిన పన్నులు ఎగ్గొట్టడంలో మహా ఘనుడు. కొద్దిరోజుల క్రితం రష్మికకు షాక్ ఇచ్చిన ఐటీ… ఇప్పుడు విజయ్ పని పడుతోంది. ఒకటా రెండా…దాదాపు 8గంటలు […]

తమిళ హీరో విజయ్‌కు ఐటీ బిగిల్
X

ఈ స్టార్ హీరోలున్నారే…తెరపై డెలాగులు బహుబాగా సెప్తారు కానీ…తెర వెనుక మాత్రం అంతా గప్‌చుప్‌ యవ్వారమే…. అన్న డైలాగ్ ఈ మధ్య కాలంలో తెగ పాపులరైంది. తెలుగులో ఒక హీరో అంతా మనం ఉంచుకోకూడదు… కొంత ఇచ్చేయాలి అంటూ తెగ ఊదరగొట్టే హీరో నిజ జీవితంలో మాత్రం, సమాజానికి ఏం ఇవ్వకపోయినా… కట్టాల్సిన పన్నులు ఎగ్గొట్టడంలో మహా ఘనుడు.

కొద్దిరోజుల క్రితం రష్మికకు షాక్ ఇచ్చిన ఐటీ… ఇప్పుడు విజయ్ పని పడుతోంది. ఒకటా రెండా…దాదాపు 8గంటలు పాటు విచారణ చేసింది. షూటింగ్ లొకేషన్‌నుంచే విజయ్‌ను ఇంటికి తీసుకొచ్చి మరీ… లెక్కల్లో లేని లెక్కను పక్కాగా తేల్చే పని పెట్టుకుంది. విజయ్ ఇంట్లో భారీగా నగదు, నగలు, ఆస్తులు బయటపడ్డాయని…అందుకే గంటల తరబడి విచారిస్తున్నారని చెన్నై నుంచి వినిపిస్తున్న టాక్.

తమిళ హీరో విజయ్ నివాసంలో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. దాదాపు ఏడుగంటలుగా విజయ్‌ను ఐటీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఎనిమిది మంది అధికారుల బృందం విచారిస్తోంది. ముందు జాగ్రత్తగా విజయ్ ఇంటి ముందు ఏడుగురు గన్‌మెన్‌లతో భద్రత ఏర్పాటు చేశారు. విజయ్ ఇంట్లో ఐటీ సోదాలు చేస్తున్నారన్న న్యూస్‌తో ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెన్నై పనాయూర్‌లో ఉన్న విజయ్ ఇంటికి ఫ్యాన్స్ తాకిడి ఎక్కువ కావడంతో…భద్రతను పెంచారు.

ఈ తెల్లవారుజామున 2 గంటల నుంచి ఐటీ విచారణ కొనసాగుతోంది. విజయ్ ఇంటితో పాటు ఏజీఎస్‌ ఎంటర్‌టైన్ మెంట్‌ ప్రైవేట్ లిమిటెడ్, ఏజీఎస్‌ సినిమా, డిస్ట్రిబ్యూషన్, ప్రొడక్షన్‌లపై నిన్న సాయంత్రం నుంచి ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. 20 ప్రాంతాలల్లో ఏకకాలంలో ఐటీ తనిఖీలు చేస్తోంది. ఇప్పటి వరకు ఏజీఎస్‌ కార్యాలయంలో 30కోట్లకు పైగా నగదు, బంగారం భారీగా స్వాధీనం చేసుకున్న ఐటీ…ఆ సంస్థకు సమన్లు జారీ చేసింది.

మరోవైపు మాస్టర్ సినిమా షూటింగ్‌లో ఉన్న విజయ్‌ ను లోకేషన్‌లో ఐటీ అధికారులు ప్రశ్నించారు. బిగిల్ సినిమా రెమ్యూనరేషన్ తో పాటు ఇతర లావాదేవీలపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఏజీఎస్ సంస్థే బిగిల్ సినిమాను నిర్మించింది. ఈ చిత్రం బాక్సాఫిస్ హిట్‌గా నిలిచింది. అంతేకాదు సుమారు 250 నుంచి 300కోట్ల మేర వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నట్లు సమాచారం. ఉదయం నుంచి పలు దస్తావేజులను పరిశీలించిన ఐటీ అధికారులు..బిగిల్ సినిమాకు సంబంధించిన ఐటీ వివరాలు సరిగ్గా లేవని నిర్థారించింది.

లోకేషన్‌లో విజయ్‌ను విచారించడం చెన్నైలో హాట్‌టాపిక్‌గా మారింది. లోకేషన్ నుంచే విజయ్‌ను ఇంటికి తీసుకొచ్చి మళ్లీ విచారిస్తుండడంతో…పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. విజయ్ ఇంట్లో భారీగా డబ్బును కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం…

విజయ్‌ ఐటీ రైడ్స్ వెనుక బీజేపీ హస్తముందంటున్నారు అభిమానులు. గతంలో విజయ్ మూవీల్లో బీజేపీకి వ్యతిరేకంగా కొన్ని డైలాగులు చెప్పారన్న విమర్శలు వచ్చాయి. ఈ కోపంతోనే బీజేపీ విజయ్‌ను టార్గెట్ చేసిందని..ఐటీ రైడ్స్ పేరుతో కక్ష సాధించే పని పెట్టుకుందని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మామూలుగా విజయ్ ఇంట్లో ఐటీ సోదాలు ఇప్పుడు కొత్తేం కాదు..మూడేళ్ల కిందటా ఐటీ రైడ్స్ జరిగాయి. అయితే విజయ్‌ను టార్గెట్ గా పెట్టుకోవాల్సిన అవసరం తమ పార్టీకి లేదని బీజేపీ నేతలు అంటున్నారు. మొత్తానికి తమిళనాడు వ్యాప్తంగా ఈ న్యూస్..ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

First Published:  5 Feb 2020 11:34 PM GMT
Next Story