Telugu Global
Cinema & Entertainment

#RRR:జక్కన్న సంక్రాంతి వాయిదా అందుకేనా?

దర్శకుడు రాజమౌళి అభిమానులందరికీ షాకిచ్చారు. 2020 జూలై 30న రిలీజ్ చేస్తాన్న ఆర్ఆర్ఆర్ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి వాయిదా వేశారు. ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మూవీ ఏకంగా ఆరునెలలకు పైగా వాయిదా వేయడంతో ఫ్యాన్స్ సహా చిత్ర పరిశ్రమ మొత్తం షాక్ కు గురైంది. రాజమౌళి ప్రస్తుతం తీస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఏకంగా 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. స్టార్ హీరో, హీరోయిన్లు నటిస్తున్నారు. ఇంత భారీ తారాగణం.. హిందీ హీరోలను పెట్టి […]

#RRR:జక్కన్న సంక్రాంతి వాయిదా అందుకేనా?
X

దర్శకుడు రాజమౌళి అభిమానులందరికీ షాకిచ్చారు. 2020 జూలై 30న రిలీజ్ చేస్తాన్న ఆర్ఆర్ఆర్ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి వాయిదా వేశారు. ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మూవీ ఏకంగా ఆరునెలలకు పైగా వాయిదా వేయడంతో ఫ్యాన్స్ సహా చిత్ర పరిశ్రమ మొత్తం షాక్ కు గురైంది.

రాజమౌళి ప్రస్తుతం తీస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఏకంగా 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. స్టార్ హీరో, హీరోయిన్లు నటిస్తున్నారు. ఇంత భారీ తారాగణం.. హిందీ హీరోలను పెట్టి కోట్లు పెట్టి తీస్తున్నారు. అందుకే ఆ సినిమాను మంచి సీజన్ లో రిలీజ్ చేస్తేనే కాసులొస్తాయి. పెట్టిన పెట్టుబడికి సరిపడా ఫ్రాఫిట్ వస్తుంది. అందుకే జక్కన్న అన్ సీజన్ అయిన జూన్ 30న కాకుండా మంచి సినిమా సీజన్ అయిన సంక్రాంతికి వాయిదా వేసినట్టు అర్థమవుతోంది.

ఈ సంక్రాంతికి విడుదలైన సరిలేరు, అల వైకుంఠపురం సినిమాలు ఓ మోస్తారు హిట్ అయితేనే ఒక్కో సినిమా ఏకంగా 200 కోట్ల గ్రాస్ కలెక్షన్ల చొప్పున వసూళ్లు సాధించాయి. అదే రాజమౌళి ఆర్ఆర్ఆర్ లాంటి సినిమా అయితే కలెక్షన్ల పంట పండడం ఖాయం. అందుకే రాజమౌళి తెలివిగా తన సినిమాను మంచి సినిమాల సీజన్ అయిన సంక్రాంతికి వాయిదా వేసినట్టు అర్థమవుతోంది.

మంచి క్వాలిటీ విజువెల్ ఎఫెక్ట్.. పైగా దేశంలోని అన్ని భాషలు, ప్రపంచవ్యాప్తంగా సినిమాను రిలీజ్ చేసేందుకు రాజమౌళి తన ఆర్ఆర్ఆర్ సినిమాను 2021 సంక్రాంతికి షిఫ్ట్ చేసినట్టు సమాచారం. మరి వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందనేది వేచిచూడాలి.

First Published:  6 Feb 2020 2:24 AM GMT
Next Story