బాలకృష్ణ అల్లుడికి… ఆస్తుల జప్తు నోటీస్

టీడీపీ నేత, బాలకృష్ణ అల్లుడు, గీతం సంస్థల అధినేత శ్రీ భరత్ కు షాక్ ఇచ్చింది కరూర్ వైశ్యా బ్యాంక్. 

హైదరాబాద్‌ అబిడ్స్ కరూర్ వైశ్యా బ్యాంక్ కు సుమారు 125 కోట్లు చెల్లించాల్సిన కేసులో భరత్‌ కుటుంబీకులకు…. ముఖ్యంగా ఆయన తండ్రి పట్టాభి రామారావు, బంధువు లక్ష్మణరావు తదితరులకు బ్యాంకు నోటీసులు జారీ చేసింది.

టెక్నో యూనిక్ ఇన్ఫ్రా టెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరిట తీసుకున్న రుణం ఎగవేశారని… అసలు, వడ్డీ కలిపి సుమారు 125 కోట్ల రూపాయలు చెల్లించాలని బ్యాంక్ నోటీసు ఇచ్చింది.

ఈ రుణాన్ని జనవరి 21 లోగా చెల్లించాలని నోటీసు ఇచ్చినా… వాళ్లు స్పందించకపోవడంతో ఆస్తులు స్వాధీనం చేసుకుంటామని మరో నోటీస్ జారీ చేశారు.

రుణం కోసం బ్యాంక్ లో తాకట్టు పెట్టిన గాజువాక మండలం, భీమిలి మండలం లోని భూములు స్వాధీనం చేసుకుని, వేలం వేస్తామని బాంక్ హెచ్చరిక జారీ చేసింది.

గతంలో ఆంధ్రా బాంక్ కు సుమారు వంద కోట్ల రుణం ఎగవేసిన భరత్ ఇప్పుడు కరూర్ వైశ్యా బాంక్ కు ఎగవేతతో ఈ ఆస్తుల జప్తు నోటీస్ అందుకున్నారు.