Telugu Global
NEWS

లోకేష్‌ పై ఐటీ ఉచ్చు? సన్నిహితుల ఇంట్లో రెండో రోజూ సోదాలు

తెలుగుదేశంలో ఐటీ కలకలం మొదలైంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు సన్నిహితుడు, మాజీ పీఏ శ్రీనివాస్ తో పాటు లోకేష్‌ సన్నిహితుడు రాజేష్‌ ఇంట్లో రెండు రోజులుగా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక ఐటీ బృందాలు, హైద్రాబాద్ తో పాటు, విజయవాడలో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నాయి. గురువారం ఉదయం ప్రారంభమైన సోదాలు… ఇవాళ కూడా కొనసాగుతున్నాయి. చంద్రబాబు మాజీ పీఏ శ్రీనివాస్ కు సంబంధించిన గాయత్రినగర్ లోని కంచుకోట అపార్ట్ మెంట్ మూడో […]

లోకేష్‌ పై ఐటీ ఉచ్చు? సన్నిహితుల ఇంట్లో రెండో రోజూ సోదాలు
X

తెలుగుదేశంలో ఐటీ కలకలం మొదలైంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు సన్నిహితుడు, మాజీ పీఏ శ్రీనివాస్ తో పాటు లోకేష్‌ సన్నిహితుడు రాజేష్‌ ఇంట్లో రెండు రోజులుగా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.

ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక ఐటీ బృందాలు, హైద్రాబాద్ తో పాటు, విజయవాడలో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నాయి. గురువారం ఉదయం ప్రారంభమైన సోదాలు… ఇవాళ కూడా కొనసాగుతున్నాయి.

చంద్రబాబు మాజీ పీఏ శ్రీనివాస్ కు సంబంధించిన గాయత్రినగర్ లోని కంచుకోట అపార్ట్ మెంట్ మూడో ఫ్లోర్ 303 ఫ్లాట్ తో పాటు… హైద్రాబాద్ ఎల్బీ నగర్ సమీపంలో ఉన్న చంపాపేట్ వద్ద ఉన్న ఇంటిలో ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. పూర్తిగా హైదరాబాద్‌ అధికారులకు సంబంధం లేకుండా ఈ సోదాలు నడుస్తున్నాయి. కేంద్ర బలగాలు బందోబస్తు నడుమ ఈ సోదాలు కొనసాగుతున్నాయి.

విజయవాడ కంచుకోట అపార్ట్ మెంట్ లోకి బయట నుంచి ప్రింటర్ ను ఐటీ అధికారులు తీసుకెళ్లారు. శ్రీనివాస్ బంధువులు ఎవ్వరినీ లోపలికి అనుమతించడం లేదు. ఇంకా కొంత సమయం పాటు ఐటీ సోదాలు కొనసాగనున్నట్లు సమాచారం. ఈ సోదాల్లో ఇప్పటికే 150 కోట్లు అక్రమ ఆస్తులు గుర్తించినట్టు సమాచారం.

ఇటు రాజేష్‌కు సంబంధించిన బినామీ లావాదేవీలను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. గతంలో అమరావతిలో కాంట్రాక్టులు చేసిన ఓ కంపెనీలో ఇటీవల ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. అప్పుడు 150 కోట్ల అక్రమ లావాదేవీలను గుర్తించారు. ఆ లావాదేవీలతో టీడీపీకి చెందిన అగ్ర నేతలకు సంబంధాలు ఉన్నట్లు లింక్‌లో తేలింది. ఈ లింక్‌ను తేల్చేందుకు ఐటీ అధికారులు సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది.

చంద్రబాబు మాజీ పీఏ శ్రీనివాస్ తో పాటు లోకేష్‌ సన్నిహితుడు రాజేష్‌… కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డికి అప్పుడు జరిగిన వ్యవహారాలతో సంబంధాలు ఉన్నట్లు తేలింది. దీంతో ఇప్పుడు ఐటీ సోదాలు టీడీపీలో కలకలం రేపుతున్నాయి. ఇటు ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి ప్రత్తిపాటి కుమారుడి ఇంట్లో కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. కేంద్ర బలగాల భద్రత మధ్య ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి.

మరోవైపు తిరుపతిలో కూడా ఐటీ దాడులు జరుగుతున్నాయి. మూడు రోజులుగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిల్డర్లు, గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకుల ఇళ్ళు, కార్యాలయాల్లో ఐటి అధికారులు సోదాలు చేస్తున్నారు. ఐటీ దాడుల్లో 30 మంది అధికారులు పాల్గొన్నారు.

First Published:  7 Feb 2020 1:48 AM GMT
Next Story