Telugu Global
Cinema & Entertainment

యుద్ధ విమానం ఎక్కిన పాయల్ రాజ్ పుత్

అవును.. తన కెరీర్ లోనే క్లిష్టమైన క్యారెక్టర్ పోషించింది పాయల్ రాజ్ పుత్. యుద్ధ విమానం పైలెట్ గా ఆమె నటించింది. త్వరలోనే పాయల్ లుక్ ను విడుదల చేయబోతున్నారు. దర్శకుడు జయంత్ సి.పరాన్జీ ఓ సినిమా చేస్తున్నాడు. సినిమా పేరు నరేంద్ర. ఈ సినిమాలో హీరో ఓ అమాయకుడైన బాక్సర్. అనుకోకుండా పాక్ లో చిక్కుకుంటారు. అక్కడి జైళ్లో ఉండిపోతాడు. అతడ్ని బయటకు తీసుకొచ్చే యుద్ధ విమానం పైలెట్ గా కనిపించబోతోంది పాయల్. ఈ పాత్ర […]

యుద్ధ విమానం ఎక్కిన పాయల్ రాజ్ పుత్
X

అవును.. తన కెరీర్ లోనే క్లిష్టమైన క్యారెక్టర్ పోషించింది పాయల్ రాజ్ పుత్. యుద్ధ విమానం పైలెట్ గా ఆమె నటించింది. త్వరలోనే పాయల్ లుక్ ను విడుదల చేయబోతున్నారు.

దర్శకుడు జయంత్ సి.పరాన్జీ ఓ సినిమా చేస్తున్నాడు. సినిమా పేరు నరేంద్ర. ఈ సినిమాలో హీరో ఓ అమాయకుడైన బాక్సర్. అనుకోకుండా పాక్ లో చిక్కుకుంటారు. అక్కడి జైళ్లో ఉండిపోతాడు. అతడ్ని బయటకు తీసుకొచ్చే యుద్ధ విమానం పైలెట్ గా కనిపించబోతోంది పాయల్.

ఈ పాత్ర తన కెరీర్ లోనే ఎంతో ప్రత్యేకమైనదిగా చెబుతోంది పాయల్. ఆమధ్య డిస్కోరాజా ప్రమోషన్స్ లో పాయల్ రహస్యంగా ఉంచిన పాత్ర కూడా ఇదే. తన అప్ కమింగ్ మూవీస్ గురించి చెబుతూ.. ఓ పాత్ర ఉందని, అది చాలా ప్రత్యేకమైనదని పాయల్ అప్పట్లో చెప్పుకొచ్చింది. ఇప్పుడా పాత్ర వివరాలు బయటకొచ్చాయి.

First Published:  6 Feb 2020 7:02 PM GMT
Next Story