‘ఆర్ఆర్ఆర్’…. నైజాం హక్కులకు దిల్ రాజు రికార్డు ధర!

బాహుబలి తరువాత రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ మల్లీస్టారర్ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా 2021న విడుదల చేస్తామని రాజమౌళి ప్రకటించాడు.

అయితే ఇప్పుడు సినిమా ఎలా ఉంటుందో చూడకుండా… రాజమౌళి సినిమా ఆర్ఆర్ఆర్ కోసం అగ్ర శ్రేణి పంపిణీదారులు మూవీ పంపిణీ హక్కులను పొందడానికి పోటీపడుతున్నారు.

దిల్ రాజు తాజాగా ఆర్ఆర్ఆర్ నిజాం హక్కుల కోసం రాజమౌళి టీం కోసం భారీగా ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. ఏకంగా 75కోట్లను నైజాం హక్కుల కోసం ఆఫర్ చేసినట్టు సమాచారం.

నైజాంలో ఇప్పటివరకూ ఏ సినిమా కూడా 70కోట్ల వసూళ్లు సాధించలేదు. బాహుబలి 2 మూవీ అత్యధిక వసూళ్లు సాధించింది. అందుకే ఆర్ఆర్ఆర్ పై దిల్ రాజు భారీగానే ఆఫర్ చేస్తున్నారు.

ఆంధ్ర రీజియన్ హక్కులను 100 కోట్లకు ప్రవీణ్ సొంతం చేసుకున్నాడు. ఈ రేటు ప్రకారం సీడెడ్ హక్కులు రూ.50 కోట్లు సులభంగానే సాధిస్తుందని చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాలు రెండింట్లో ఏకంగా 225 కోట్లకు ఆర్ఆర్ఆర్ మూవీ అమ్ముడు పోవడం ఖాయమని.. బాహుబలి 2 కంటే 20 కోట్లు ఎక్కువకే ఆర్ఆర్ఆర్ అమ్ముడు పోతోందని తెలుస్తోంది.