మహిళా ప్రపంచకప్ విజేతకు మరింత ప్రైజ్ మనీ

  • రెండేళ్లలో 320 శాతం పెరిగిన నజరానా

ఆస్ట్ర్రేలియా వేదికగా మరికొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే 2020 మహిళా టీ-20 ప్రపంచకప్ లో విజేతగా నిలిచిన జట్టు గతంలో ఎన్నడూ లేనంత మొత్తంలో ప్రైజ్ మనీ అందుకోనుంది.

2018 ప్రపంచకప్ విజేత జట్టు అందుకొన్న ప్రైజ్ మనీ కంటే ప్రస్తుత ప్రపంచకప్ విజేత 320 శాతం ఎక్కువ ప్రైజ్ మనీ అందుకోనున్నట్లు నిర్వాహక సంఘం ప్రకటించింది.

మొత్తం 2.6 మిలియన్ డాలర్లు ప్రైజ్ మనీగా ఇవ్వనున్నట్లు ఐసీసీ ప్రకటించింది. గతంతో పోల్చిచూస్తే …స్పాన్సర్ల నుంచి మహిళా క్రికెట్ కు సైతం రాబడి పెరిగిందని, ఆదాయం పెరిగిన కారణంగానే ప్రపంచకప్ ప్రైజ్ మనీ సైతం భారీగా పెరిగిందని వివరణ ఇచ్చింది.

విశ్వవిజేతగా నిలిచిన జట్టుకు 10 లక్షల డాలర్ల ప్రైజ్ మనీ చెక్ అందచేయనున్నారు. రన్నరప్ గా నిలిచిన జట్టు 5 లక్షల డాలర్లు నజరానాగా అందుకోనుంది.

టోర్నీలో తలపడుతున్న మొత్తం 10 జట్లకు గ్యారెంటీ మనీ సైతం ఇవ్వనున్నారు.