“అల” సల్మాన్ సెట్ అవుతాడేమో!

తెలుగులో సూపర్ హిట్టయింది అల వైకుంఠపురములో సినిమా. నాన్-బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. సౌత్ నుంచి ఓ సినిమా హిట్టయిందంటే చాలు ఆటోమేటిగ్గా సల్మాన్ ఖాన్ కన్ను దానిపై పడుతుంది. ఈ సినిమాపై కూడా అలానే ఫోకస్ పెట్టాడు సల్మాన్ ఖాన్. సినిమా గురించి ఆరా తీయడం స్టార్ట్ చేశాడు. ఓవైపు సల్మాన్ ఎంక్వయిరీ స్టార్ట్ చేయడమే ఆలస్యం, మరోవైపు ఈ సినిమా హిందీ రీమేక్ రైట్స్ హాట్ కేక్ లా అమ్ముడుపోయాయి.

అల వైకుంఠపురములో హిందీ రీమేక్ రైట్స్ ను బాలీవుడ్ నిర్మాత అశ్విన్ వర్థే దక్కించుకున్నాడు. దాదాపు 8 కోట్ల రూపాయలు చెల్లించి అతడు ఈ రీమేక్ రైట్స్ కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. గతంలో అర్జున్ రెడ్డి రీమేక్ రైట్స్ దక్కించుకుంది కూడా ఇతడే. ఆ సినిమాను కబీర్ సింగ్ గా రీమేక్ చేసి సూపర్ హిట్ కొట్టాడు. ఇప్పుడు అల వైకుంఠపురములో సినిమా రైట్స్ దక్కించుకున్నాడు.

త్వరలోనే సల్మాన్ ఖాన్ ను కలవబోతున్నాడు అశ్విన్. అల వైకుంఠపురములో సినిమాను ప్రత్యేకంగా చూపించబోతున్నాడు. సల్మాన్ కనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే, అశ్విన్ జాక్ పాట్ కొట్టినట్టే.