Telugu Global
National

మీరు ఓటేస్తామంటే.... మేము ఫ్రీగా తీసుకువెళ్తాం!

ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో…. ప్రజా రవాణా విభాగానికి సంబంధించిన ప్రైవేటు సంస్థలు సామాజిక బాధ్యతను భుజానికి ఎత్తుకున్నాయి. ఉచితంగా రైడ్ అవకాశాన్ని కల్పిస్తూ ఓటు వేసేందుకు జనాన్ని ప్రోత్సహిస్తున్నాయి. మరికొన్ని సంస్థలు రాయితీలతో కూడిన ప్రయాణాన్ని అందిస్తున్నాయి. అభీ బస్ డాట్ కామ్ వాళ్లు.. ‘ఐ ఓట్ ఐ విన్’ అనే నినాదాన్ని ప్రమోట్ చేస్తూ.. ఉచితంగా బస్సు ప్రయాణాన్ని కల్పిస్తున్నట్టు ప్రకటించింది. ఈ నెల 5 నుంచి 10 వరకూ ఈ అవకాశాన్ని కల్పించింది. ఇక.. […]

మీరు ఓటేస్తామంటే.... మేము ఫ్రీగా తీసుకువెళ్తాం!
X

ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో…. ప్రజా రవాణా విభాగానికి సంబంధించిన ప్రైవేటు సంస్థలు సామాజిక బాధ్యతను భుజానికి ఎత్తుకున్నాయి. ఉచితంగా రైడ్ అవకాశాన్ని కల్పిస్తూ ఓటు వేసేందుకు జనాన్ని ప్రోత్సహిస్తున్నాయి. మరికొన్ని సంస్థలు రాయితీలతో కూడిన ప్రయాణాన్ని అందిస్తున్నాయి.

అభీ బస్ డాట్ కామ్ వాళ్లు.. ‘ఐ ఓట్ ఐ విన్’ అనే నినాదాన్ని ప్రమోట్ చేస్తూ.. ఉచితంగా బస్సు ప్రయాణాన్ని కల్పిస్తున్నట్టు ప్రకటించింది. ఈ నెల 5 నుంచి 10 వరకూ ఈ అవకాశాన్ని కల్పించింది. ఇక.. విమానయాన సంస్థ స్పైస్ జెట్ అయితే.. ఇవాళ పోలింగ్ సందర్భంగా ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. ఇవాళ ఢిల్లీకి వచ్చి వెళ్లే వారికి బేస్ టికెట్ చార్జ్ ను తిరిగి ఇచ్చేస్తున్నట్టు వెల్లడించింది.

ఇక.. బైక్ టాక్సీ రాపిడో అయితే.. ఏకంగా ఫ్రీగా తీసుకెళ్తాం.. ఓటేయండి అని ఆఫర్ ఇచ్చేసింది. మూడు కిలోమీటర్లలోపు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేసేవారికి ఈ అవకాశం కల్పించింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ సేవలు సాయంత్రం 6 గంటల వరకూ కొనసాగనున్నట్టు తెలిపింది. ఇందులో భాగంగా.. ఇప్పటికే వందల బైకులు ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు చేరుస్తూ.. మంచి సేవలు అందిస్తున్నాయి.

ఢిల్లీ లాంటి చోట.. ఓటింగ్ కు దూరంగా ఉండే ప్రజలను.. సామాజిక బాధ్యత వైపు నడిపిస్తూ రాపిడో లాంటి సంస్థలు తీసుకున్న చర్యలను.. అభినందించాల్సిందే.

First Published:  8 Feb 2020 12:25 AM GMT
Next Story