ప్రభాస్ సినిమాకు 2 టైటిల్స్

మొన్నటివరకు జాన్ అనే టైటిల్ తోనే కిందామీదా పడ్డారు. ఆల్రెడీ దిల్ రాజు ఆ టైటిల్ వాడేయడంతో, ఇప్పుడు అదే టైటిల్ ను మరోసారి వాడుకోవడం ఎలా అంటూ ఆలోచించారు. కట్ చేస్తే, ఇప్పుడా టైటిల్ ను పూర్తిగా పక్కన పెట్టేశారు యూవీ క్రియేషన్స్ నిర్మాతలు. అంతేకాదు.. ఈసారి 2 టైటిల్స్ పిక్ చేసుకున్నారు.

ప్రభాస్-రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు జాన్ అనే టైటిల్ పెట్టాలనే నిర్ణయం నుంచి నిర్మాతలు పూర్తిగా పక్కకు తప్పుకున్నారు. ఇప్పుడా స్థానంలో ఓ డియర్, రాథే శ్యామ్ అనే రెండు టైటిల్స్ పరిశీలిస్తున్నారు. ఈ మేరకు ఈ రెండు టైటిల్స్ ను ఫిలింఛాంబర్ లో రిజిస్టర్ కూడా చేయించారు.

ఈ రెండు టైటిల్స్ లో రాథే శ్యామ్ అనే టైటిల్ వైపే మేకర్స్ ఎక్కువగా మొగ్గుచూపుతున్నారట. ఎందుకంటే, ప్రభాస్ సినిమా బాలీవుడ్ లో కూడా రిలీజ్ అవుతుంది. రాథే శ్యామ్ అనే టైటిల్ అయితే బాలీవుడ్ జనాలకు బాగా కనెక్ట్ అవుతుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే టైటిల్ పై ఓ క్లారిటీ రాబోతోంది. అన్నట్టు ఈ సినిమాను ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.