అవును… నేను విలన్ గా చేస్తున్నాను

ఎట్టకేలకు సమంత క్లారిటీ ఇచ్చేసింది. కెరీర్ లో ఫస్ట్ టైమ్ తను నెగెటివ్ షేడ్స్ లో కనిపిస్తానంటూ క్లారిటీ ఇచ్చేసింది. జాను సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈ విషయాన్ని వెల్లడించింది సమంత. ఫ్యామిలీ మేన్ సీజన్-2 వెబ్ సిరీస్ లో సమంత నెగెటివ్ రోల్ లో కనిపించనుంది. ఆ విషయాన్ని ఫస్ట్ టైమ్ నిర్థారించింది సమంత.

“ఇప్పటివరకు నేను చేసిన పాత్రల్లో చాలా కష్టపడి చేసిన రోల్ అది. ఆ క్యారెక్టర్ కోసం ఫిజికల్లీ, మెంటల్లీ చాలా కష్టపడ్డాను. అంతే కాదు, ఫస్ట్ టైమ్ ఫైట్స్ కూడా చేశాను. ఫారిన్ ఫైట్ మాస్టర్ ఆధ్వర్యంలో ట్రయినింగ్ తీసుకొని ఫైట్స్ చేశాను. ఈ క్యారెక్టర్ చేసిన తర్వాత హీరోలు ఎంత కష్టపడుతున్నారో నాకు అర్థమైంది.”

తనను కదిలించే పాత్రలు దొరికితే వెబ్ సిరీస్ లో నటించడానికి కూడా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది సమంత. కేవలం సినిమాలే చేయాలని మడికట్టుకొని కూర్చోనని, మంచి పాత్రలు దొరికితే సినిమాలతో పాటు వెబ్ సిరీస్ కూడా చేస్తానని స్పష్టంచేసింది.

ప్రొడక్షన్ పై కూడా రియాక్ట్ అయింది సమంత. సినిమాలు నిర్మించే ఆలోచన తనకు ఎప్పట్నుంచో ఉందని, ఆ టైమ్ మాత్రం ఇంకా రాలేదని చెబుతోంది. ఓవైపు నటనను కొనసాగిస్తూ, మరోవైపు నిర్మాణ రంగంలోకి వచ్చే ప్రసక్తి మాత్రం లేదంటోంది.