ఆప్‌కు జై కొట్టిన ఢిల్లీ జ‌నం

హ‌స్తిన‌లో మ‌ళ్లీ సీఎం కేజ్రీవాల్ సీఎం అవుతార‌ని ఎగ్జిట్‌ పోల్స్ స్పష్టం చేశాయి. ఆప్‌కు 50కి పైగా సీట్లు వ‌స్తాయ‌ని ప్ర‌తి స‌ర్వే తేల్చి చెప్పింది. 70 సీట్ల‌లో 50కిపైగా ఆప్‌కు వ‌స్తాయ‌ని తేల్చి చెప్పాయి. దీంతో కేజ్రీవాల్‌కు ఢిల్లీలో తిరుగులేని మెజార్టీ రావ‌డం ఖాయం.

మొత్తం 70 సీట్లున్న ఢిల్లీ అసెంబ్లీలో.. ఆమ్‌ ఆద్మీ పార్టీకి 54 నుంచి 59 సీట్లు, బీజేపీకి 9 నుంచి 15 సీట్లు, కాంగ్రెస్‌కు 0 నుంచి 2 సీట్ల వరకు గెలుచుకుంటాయని పీపుల్స్‌ పల్స్‌ ప్రెడిక్షన్‌ సర్వే సంస్థ అంచనా వేసింది.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ మరోసారి విజయ దుందుబి మోగిస్తుందని టైమ్స్‌ నౌ ప్రకటించింది. ఆమ్‌ ఆద్మీ 44, బీజేపీ 26 స్థానాల్లో విజయం సాధిస్తుందని ప్రకటించింది.

న్యూస్‌ ఎక్స్‌ నేతా ప్రకారం.. ఆప్‌ 53-57, బీజేపీ 11-17, ఇతరులు0-2 స్థానాల్లో విజయం సాధించనున్నారు.

రిపబ్లిక్‌ టీవీ ప్రకారం.. ఆప్‌ 48-61, బీజేపీ 9-21 స్థానాల్లో గెలుపొందనున్నారు.

ఇండియా టీవీ సర్వే ప్రకారం ఆప్‌ 44, బీజేపీ26, స్థానాల్లో విజయం సాధించనున్నారు.

జన్‌కీ బాత్‌ సర్వే ప్రకారం.. ఆప్‌ 55, బీజేపీ 15 స్థానాలను కైవసం చేసుకోనున్నాయి.

ఇండియా న్యూస్‌ నేషన్‌ ప్రకారం… ఆప్‌ 55, బీజేపీ 14, ఇతరులు ఒక స్థానంలో గెలుపొందనున్నారు.

సుదర్శన్‌ న్యూస్‌ సర్వే ప్రకారం.. ఆప్‌ 40-45, బీజేపీ 24-28, ఇతరులు 2-3 స్థానాల్లో విజయం సాధించనున్నారు.