పవన్ కళ్యాణ్ పై అలీ సెటైర్…

పవన్ కళ్యాణ్-అలీ…. టాలీవుడ్ లో వీరిద్దరి స్నేహబంధం గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటారు.. ఎన్నో ఏళ్ల నుంచి పవన్ సినిమాల్లో ఫ్రెండ్ గా అలీ పక్కనే ఉన్నారు. ప్రతీ సినిమాలోనూ వీరిద్దరి జోడీ ఆకట్టుకుంది.

అయితే రాజకీయం వీరిని వేరు చేసింది. అలీ… పవన్ ను కాదని ఆయన ద్వేషించే వైసీపీలో చేరడంతో పవన్ కలత చెందాడు. అయితే సినిమాలు వదిలిన పవన్ తో ఇక అలీకి ఏం పనిలేదని ఆయనే చెప్పుకున్నాడు.

అయితే తాజాగా మళ్లీ మనసు మార్చుకొని పవన్ సినిమాల బాటపట్టాడు. అటు రాజకీయాల్లో ఓటమితో పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తూనే ఏకంగా 3 సినిమాలను లైన్లో పెట్టి రెండు సినిమాలు చేస్తున్నాడు.

తాజాగా అలీ విశాఖపట్నంలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి వెళ్లారు. అక్కడ సభలో పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

అలీ మాట్లాడుతూ ‘ఎవరిని ఎక్కడ ఉంచాలో ప్రజలకు బాగా తెలుసు’ అని పవన్ పై పరోక్షంగా అలీ చేసిన ఘాటు వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

విశాఖ జిల్లాలో పవన్ ఓటమికి సెటైర్ గా అలీ ఈ వ్యాఖ్యలు చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అలీ వ్యాఖ్యలతో పవన్ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

అయితే పవన్ సినిమాల్లో ఆఫర్ వస్తే మాత్రం తాను ఖచ్చితంగా చేస్తానని అలీ అనడం అక్కడ ఉన్న వారికి ఆశ్చర్యం కలిగించింది.